Sridevi : తెలుగు , తమిళం సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి, అక్కడ కూడా సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకొని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నెంబర్ హీరోయిన్ గా దశాబ్దాలు ఏలిన మహానటి, అందాల తార శ్రీదేవి.ఈమె గురించి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో ఎవరికీ అర్థం కాదు,ఆమె ప్రస్థానం అలాంటిది మరి.ఈమె అందం గురించి గొప్పగా మాట్లాడాలా?, లేదా అద్భుతమైన ఆమె నటన గురించి మాట్లాడాలా..?
ఆమె సినిమాలు మానేసినా, నేడు మన మధ్య లేకపోయినా కూడా నేటి తరం కుర్రాళ్లకు , కుర్ర హీరోలకు శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్.ఆమెని మించిన అందగత్తె మరొకరు లేరు, భవిష్యత్తులో రాబోరు కూడా అని అంటుంటారు.అయితే శ్రీదేవి గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.ఈమె బోనికపూర్ ని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.
అయితే వాస్తవానికి శ్రీదేవి అప్పట్లో ప్రేమించింది మిథున్ చక్రవర్తినట, అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్న బోణి కపూర్ శ్రీదేవి మీద కూడా మనసుపడ్డాడట.మిథున్ చక్రవర్తి – శ్రీదేవి మధ్య గొడవలు పెట్టి, శ్రీదేవి ని మాయ చేసి తన ప్రేమలో దించుకున్నాడని బోణి కపూర్ పై అప్పటి నుండే ఒక రూమర్ ఉండేది.
అప్పట్లో బోనీకపూర్ మొదటి భార్య కి తెలియకుండా శ్రీదేవితో రహస్యం గా డేటింగ్ చేసేవారని, ఒకరోజు మీడియా వీళ్లిద్దరి ప్రేమాయణం ని బయటపెట్టడంతో సంచలనంగా మారిందని చెబుతుంటారు.. ఇది తెలుసుకున్న బోణి కపూర్ వాళ్ళ అమ్మ శ్రీదేవిని ఒక మూవీ ఫంక్షన్ లో చెప్పు తీసుకొని కొట్టిందట. తన భర్త తనకి ఇంత అన్యాయం చేసాడనే బాధని తట్టుకోలేక బోణి కపూర్ మొదటి భార్య విడాకులు ఇచ్చేసిందని బాలీవుడ్ లో ఒక వార్త ప్రచారంలో ఉంది. అప్పట్లో ఇది సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికీ ఈ విషయం గురించి మీడియా మాట్లాడుకుంటూనే ఉంటుంది.