ఇక అనిల్ కపూర్ కి సోనమ్ కపూర్ మరియు రియా కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, సోనమ్ కపూర్ బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రియా కపూర్ పెద్ద నిర్మాతగా కొనసాగుతుంది.ఇద్దరు కుమార్తెలతో పాటుగా హర్షవర్ధన్ కపూర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు, ఈయన కూడా హిందీ లో పలు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, అవి పెద్దగా సక్సెస్ సాధించలేదు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా అనిల్ కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కూతుర్ల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడొస్తున్న దుస్తులు మరియు ఇతర వస్తువులు జెండర్ తో సంబంధం లేకుండా వాడుకునే విధంగా ఉంటున్నాయి.నేను కొన్నిసార్లు నా కూతుర్లు సోనమ్ కపూర్ మరియు రియా కపూర్ బీరువాలను ఓపెన్ చేసి వాళ్ళ సన్ గ్లాసులను మరియు దుస్తులను దొంగలించిన సందర్భాలు చాలానే ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు.
అనిల్ కపూర్ లాంటి సూపర్ స్టార్ కి కూడా దొంగలించాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటూ నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ‘జగ్ జగ్ జియో’ అనే సినిమా తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ కపూర్, ప్రస్తుతం రణబీర్ కపూర్ మరియు సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎనిమల్’ అనే చిత్రం లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.