Raveena Tandon: తల్లిదండ్రులను కొడుకులు ఆదరిస్తారా? లేదా కూతుళ్లా అంటే ఖచ్చితంగా ఆడబిడ్డలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి చనిపోతే కొడుకులు తలకొరివి పెడుతుంటారు. కానీ ఇక్కడ తండ్రిపై వెలకట్టలేని ప్రేమతో కూతురే కొడుకై అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆమె సాధారణ మహిళ కాదు.. బాలీవుడ్ దిగ్గజ హీరోయిన్ రవీనా టాండన్.

సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనూ ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఇక్కడ కూడా గుర్తింపు పొందింది. తాజాగా రవీనా తండ్రి, ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన రవిటాండన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 11న ముంబై హాస్పిటల్ లో చికిత్స పొదుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 85 సంవత్సరాలు.
తండ్రి చనిపోవడంతో తట్టుకోలేని కూతురు రవీనా దగ్గరుండి మరీ స్వయంగా ఆయన దహన సంస్కారాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలతోపాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి మృతితో రవీనా ఎమోషనల్ అయ్యింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో రవీనా టాండన్ ఒక ఎమోషనల్ లేఖను విడుదల చేసింది. ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావని.. నన్ను, నువ్వే దగ్గరుండి అడుగులు వేయిస్తావ్ నాన్న అంటూ తలుచుకొని కన్నీరు పెట్టుకుంది రవీనా టాండన్.
1963లో సునీల్ దత్ నిర్మాణంలో ‘యే రాస్తే హై ప్యార్ కే’తో రవిటాండన్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన పెద్ద హీరోలతో కూడా పనిచేశారు. ‘ఖేల్ ఖేల్ మే’, అన్హోనీ లాంటి చాలా సినిమాలను తెరకెక్కించారు. ‘నజరారా’, మజ్బుర్’ , జిందగీ లాంటి హిట్ సినిమాలు రవిటాండన్ ఖాతాలో ఉన్నాయి. ఇక మంచి ఫామ్ లో ఉన్నప్పుడే తన కూతురు రవీనా టాండన్ ను హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి రవి టాండన్ పరిచయం చేశాడు.
[…] […]