Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- BJP: పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ.. ఇదే సాక్ష్యం.. వైసీపీకి షాక్ లగా!

Pawan Kalyan- BJP: పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ.. ఇదే సాక్ష్యం.. వైసీపీకి షాక్ లగా!

Pawan Kalyan- BJP: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్న పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధపడుతున్నారు. సంక్రాంతి తరువాత బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి వారాహి ప్రచార రథంతో పాటు కాన్వాయ్ వాహనాలు సిద్ధమయ్యాయి. అటు యాత్ర షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. దాదాపు 175 నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి? ఎటు నుంచి యాత్ర ప్రారంభించాలన్న దానిపై తుది కసరత్తు జరుగుతోంది. కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ విముక్త ఏపీ అంటూ ఇప్పటికే పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీనే పవన్ టార్గెట్ చేసుకునే అవకాశముంది. దీంతో అటు వైసీపీ శ్రేణులు సైతం కలరవపాటకు గురవుతున్నాయి. ప్రచార రథం వారాహి విషయంలో ఎంత దుష్ప్రచారం చేయాలో చేసి అబాసుపాలయ్యారు. ఆ వాహనానికి తెలంగాణ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అన్ని రకాల క్లీయరెన్స్ లు ఇచ్చేసరికి వారు షాక్ కు గురయ్యారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఓ మంచి రోజు వాహనానికి పూజ చేసి యాత్రకుసంబంధించి షెడ్యూల్ విడదల చేసే అవకాశముంది.

Pawan Kalyan- BJP
Pawan Kalyan- BJP

అంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా మరో కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టనున్నారు. యువభేరీ పేరిట ప్రజల ముంగిటకు వస్తున్నారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువభేరీ నిర్వహించనున్నారు. అటు తరువాత మిగతా 25 జిల్లాల్లోకూడా నిర్వహించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో బలమైన అభిమానుల ఓటు బ్యాంకు చెదిరిపోయిన తరుణంలో.. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా విద్యార్థులు, యువత జనసేనకు ఓటు వేయడమే కాకుండా మద్దతుగా నిలిపే ప్రయత్నంలో భాగంగా యువభేరీ నిర్వహిస్తున్నారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ యూత్ ను టార్గెట్ చేసుకొని చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్ వంటి వాటిపై గట్టిగానే పోరాటం చేశారు. వాటితోనే యువత భవిత ఆధారపడి ఉందని.. వాటిని సాధించడంలో నాటి చంద్రబాబు సర్కారు విఫలమైందని నమ్మించారు. తనకు అధికారం ఇస్తే అన్నీ చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కనీసం వాటి సాధనకు ప్రయత్నం కూడా చేయలేదు. ‘సరెండర్, సైలెంట్’తో నాలుగేళ్లు కాలం గడిపేశారు. అందుకే పవన్ జగన్ వైఫల్యాలను అజెండాగా చేసుకొని విద్యార్థులు, యువతను మేలుకొల్పనున్నారు. వారితో జనసేనకే ఓటు వేస్తామని హామీ తీసుకోనున్నారు.

అయితే పవన్ ఇంతలా దూకుడు పెంచడానికి కారణమేమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ప్రతీ వారం ఏదో ప్రజోపయోగ కార్యక్రమంలో పవన్ .జనాలు ముందుకు వస్తున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తున్నారు. అయితే పవన్ విశాఖలో ప్రధాని మోదీని కలిసిన తరువాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అంతకంటే ముందే వైసీపీ పై పోరాటానికి బీజేపీ తగిన విధంగా సాయం చేయడం లేదని పవన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. అక్కడకు కొద్దిరోజులకే పవన్ కు ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం వచ్చింది. ప్రధానిని విశాఖలో కలవాలని వర్తమానం అందింది. అయితే ప్రధానితో భేటీ తరువాతే చాలా కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఎన్నికల వ్యూహాల్లో భాగమేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పవన్ వెనుక కచ్చితంగా బీజేపీ ఉందని నమ్మకంగా చెబుతున్నారు.

Pawan Kalyan- BJP
Pawan Kalyan- BJP

అటు పవన్ కు నేరుగా బీజేపీ నేతల నుంచి సపోర్టు లభిస్తోంది. ఇటీవల వారాహి వాహనంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు రియాక్టయ్యారు. విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీ తీరుపై ఫైర్ అయ్యారు. పవన్ బస్సు యాత్రను అడ్డుకునే హక్కు వైసీపీకి లేదన్నారు. వాహనం రంగుపై అభ్యంతరం వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. చూసే కళ్లు బట్టి కలర్ ఉంటుందని సెటైరికల్ గా మాట్లాడారు. అటు బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ పవన్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఈ పరిస్థితులన్నీ తెలియజేస్తున్నాయి. అయితే ఈ పరిణామ క్రమంలో వైసీపీ కలవరపాటుకు గురవుతోంది. నిజంగా ప్రధాని మోదీ తమపై పోరాటానికి రూట్ మ్యాప్ ఇచ్చారా? అంటూ చర్చించుకోవడం వారి వంతైంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version