https://oktelugu.com/

Bigg Boss OTT Bindu madhavi : బాత్రూమ్ లొల్లి: బిందుమాధవి, శివల ఫ్రెండ్ షిప్ కు బ్రేక్.. అసలేం జరిగింది?

Bigg Boss OTT Bindu madhavi :  బిగ్ బాస్ నాన్ స్టార్ ఓటీటీ వేదికగా హీట్ పెంచుతోంది. 8వ వారం నామినేషన్స్ సెగలు, పొగలు కక్కింది. ముఖ్యంగా బిందుమాధవి -అఖిల్ మధ్యలో వాదోపవాదాలు చిచ్చుపెట్టేశాయి. వీరి మధ్య లొల్లి పతాకస్థాయికి చేరింది. ఈ విషయంలో ముందుగానే కెప్టెన్ అయిన తన స్నేహితుడు యాంకర్ శివను ‘బాత్రూమ్ పాయింట్’ చెప్పమని బిందు అడిగింది. దీనికి శివ నువ్వు ఆ పాయింట్ రైజ్ చేయి నేను మాట్లాడుతా అన్నట్టుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2022 / 12:11 PM IST
    Follow us on

    Bigg Boss OTT Bindu madhavi :  బిగ్ బాస్ నాన్ స్టార్ ఓటీటీ వేదికగా హీట్ పెంచుతోంది. 8వ వారం నామినేషన్స్ సెగలు, పొగలు కక్కింది. ముఖ్యంగా బిందుమాధవి -అఖిల్ మధ్యలో వాదోపవాదాలు చిచ్చుపెట్టేశాయి. వీరి మధ్య లొల్లి పతాకస్థాయికి చేరింది. ఈ విషయంలో ముందుగానే కెప్టెన్ అయిన తన స్నేహితుడు యాంకర్ శివను ‘బాత్రూమ్ పాయింట్’ చెప్పమని బిందు అడిగింది. దీనికి శివ నువ్వు ఆ పాయింట్ రైజ్ చేయి నేను మాట్లాడుతా అన్నట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కానీ శివ ఈ విషయంలో బిందును దారుణంగా మోసం చేశాడు.

    నామినేషన్స్ ప్రారంభం కాగానే అఖిల్ తో గొడవకు దిగింది బిందు. ఆ బాత్రూమ్ పాయింట్ లేవనెత్తింది. ఈ క్రమంలోనే శివ సపోర్టు చేయకుండా హ్యాండ్ ఇవ్వడం చూసి బిందు షాక్ అయ్యింది. ‘ఆ పాయింట్ ఏంటో నాకు గుర్తు లేదు నువ్వే చెప్పు అని’ బిందు అన్నా శివ చెప్పలేదు. అఖిల్ కు ఇది ఆయుధమై బిందుపై రెచ్చిపోయాడు.

    అసలీ బాత్రం లొల్లి ఏంటంటే.. బిందుమాధవి వాష్ రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ అఖిల్ అమ్మాయి కాబట్టి చెప్పట్లేదంటూ కామెంట్ చేశాడు. శివతో ఈ విషయం పంచుకున్నాడు. ఆ విషయం ఏంటని బిందు గట్టిగా శివను నిలదీసింది. నేరుగా అఖిల్ ను కూడా అడిగింది. శివ కూడా ఏ విషయాన్ని బిందుకు చెప్పలేదు. దీనిపై శివతో గొడవకు కూడా దిగింది బిందు. ఆ పాయింట్ ఏంటో చెప్పమని అడిగింది. కానీ శివ మాత్రం అది అమ్మాయిల మ్యాటర్ అని.. నేను తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వకూడదని చెప్పకుండా దాటవేశాడు.. ఆ పాయింట్ నీకు చెప్పలేనని బిందుతో స్పష్టం చేశాడు.

    బాత్రూంలో జరిగింది సెన్సిటివ్ మ్యాటర్ అని శివ ఈ విషయాన్ని బిందుకు చెప్పలేదు. అఖిల్ ను అడిగినా ఏ విషయాన్ని చెప్పలేదు. దీంతో ‘తన మోషన్స్ గురించే’ శివ-అఖిల్ మాట్లాడుకున్నారని బిందు మాధవి భావించింది.

    రాత్రిపూట బిందు వద్దకు వచ్చి మరీ శివ క్లారిటీ ఇచ్చాడు. కానీ నామినేషన్స్ లో తన వైపు స్టాండ్ తీసుకోని శివపై బిందు ఫైర్ అయ్యింది. నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకున్నావని.. భయపడ్డావని ఫైర్ అయ్యింది. నాతో మాట్లాడవద్దని శివకు స్పష్టం చేసింది బిందు.

    ఇలా ఇద్దరి మధ్యలో బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి మొదలైన ఫ్రెండ్ షిప్.. ‘బాత్రూంలో శివ-అఖిల్’ మాటలతో చెడిపోయినట్టైంది. ఇప్పుడు కలిసి మెలిసి ఉన్న బిందు, శివలు ఈ ఒక్క సంఘటనతో విడిపోయారు. ఆడియెన్స్ వీరి ఫ్రెండ్ షిప్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వాష్ రూమ్ ఇష్యూ ఎంతవరకూ వెళుతుందన్నది వేచిచూడాలి.