https://oktelugu.com/

Bimbisara Release Trailer Talk : కళ్యాణ్ రామ్ చారిత్రక పౌరుషాన్ని తట్టిలేపిన ‘బింబిసార’..

Bimbisara Release Trailer Talk : అన్న నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని కొనసాగించడంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ముందున్నారు. ఇక ఎన్టీఆర్ లాగా చారిత్రక కథలను ఆయన వారసులు పెద్దగా తీయడం లేదు. తీసిన చిత్రాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. తాజాగా కళ్యాణ్ రామ్ అలాంటి ప్రయత్నమే చేశాడు. ‘బింబిసార’ అంటూ చారిత్రక కథను సినిమాగా మలిచాడు.  బింబిసార పేరుతో తెరకెక్కిన ఆ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల కాగా.. గూస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2022 / 06:25 PM IST
    Follow us on

    Bimbisara Release Trailer Talk : అన్న నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని కొనసాగించడంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ముందున్నారు. ఇక ఎన్టీఆర్ లాగా చారిత్రక కథలను ఆయన వారసులు పెద్దగా తీయడం లేదు. తీసిన చిత్రాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. తాజాగా కళ్యాణ్ రామ్ అలాంటి ప్రయత్నమే చేశాడు. ‘బింబిసార’ అంటూ చారిత్రక కథను సినిమాగా మలిచాడు.  బింబిసార పేరుతో తెరకెక్కిన ఆ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల కాగా.. గూస్ బంబ్స్ వచ్చేలా ఉంది.

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ . ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చారిత్రక నేపథ్యంలో ఫుల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు.

    ఈ సినిమాలో హీరోయిన్స్ గా క్యాథరిన్, సంయుక్త మీనన్ లు నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్, జానర్ లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితోపాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు.

    ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈనెల 29న హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం.

    ఈ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. ఒక రాజ్యం సరిహద్దులను ఆపై రాజ్యాలకు విస్తరించాలనే బింబిసార యుద్ధకాంక్షను అందులో అద్భుతంగా చూపించారు. చరిత్రలో విస్తరణ కాంక్షతో బింబిసారుడి చేసిన పౌరుషాలను గొప్పగా తెరకెక్కించారు. కళ్యాణ్ కెరీర్ లోనే చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో కళ్యాణ్ రామ్ చేసినట్టు తెలుస్తోంది.

    ముఖ్యంగా బింబిసారగా కళ్యాణ్ రామ్ విశ్వరూపం చూపించాడు. ఇక బార్బేరియన్ కింగ్ బింబిసారుడు దాచిపెట్టిన నిధిని సొంతం చేసుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. వారి ఆటలను బింబిసారుడిగా మళ్లీ జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా ఈ కాలంలో అంతం చేశాడన్నది ఈ సినిమాగా మలిచారు. ఈ సినిమాలోని అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు చూస్తేనే ఆ రిచ్ నెస్ స్పష్టంగా కనిపిస్తోంది.

    మొత్తంగా బింబిసారుడిగా కోట్లు ఖర్చుపెట్టిన కళ్యాణ్ రామ్ కష్టానికి తెరపై అద్భుతంగానే ఔట్ పుట్ వచ్చింది. మరి అది ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.