https://oktelugu.com/

BiggBoss 6 Telugu Nominations: బిగ్ బాస్ 4వ వారం: ఈ వారం అత్యధికంగా 9మంది నామినేట్.. మళ్లీ రేవంత్ టార్గెట్

BiggBoss 6 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి నాలుగోవారం నామినేషన్స్ సెగలు, పొగలు కక్కింది. నామినేషన్స్ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. హౌస్ లో తమను ఇబ్బందిపెట్టిన.. తిట్టిన వారిని తోటివారు నామినేట్ చేసేశారు. ఇక తనను నామినేట్ చేయడంపై కీర్తి బరెస్ట్ అయ్యింది. తన బాధలు చెప్పుకోవడం వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయ్యిందా? అంటూ సింగర్ రేవంత్ తో పెద్ద గొడవనే పెట్టుకుంది. కీర్తి, ఇనయాల మధ్య పెద్ద వైరమే సాగింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2022 / 11:18 PM IST
    Follow us on

    BiggBoss 6 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి నాలుగోవారం నామినేషన్స్ సెగలు, పొగలు కక్కింది. నామినేషన్స్ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. హౌస్ లో తమను ఇబ్బందిపెట్టిన.. తిట్టిన వారిని తోటివారు నామినేట్ చేసేశారు.

    ఇక తనను నామినేట్ చేయడంపై కీర్తి బరెస్ట్ అయ్యింది. తన బాధలు చెప్పుకోవడం వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయ్యిందా? అంటూ సింగర్ రేవంత్ తో పెద్ద గొడవనే పెట్టుకుంది.
    కీర్తి, ఇనయాల మధ్య పెద్ద వైరమే సాగింది. దాదాపు కొట్టుకునేంత వరకూ సాగింది.

    ఈ వారం నామినేషన్స్ చూస్తే ప్రధానంగా సింగర్ రేవంత్ తోపాటు ఇనాయాలను టార్గెట్ చేశారు. వీరిద్దరి దూకుడు దురుసు తనాన్ని వేలెత్తి చూపించారు. అందరూ టార్గెట్ చేసిన
    ఇనయా చాలా ఓపికగా ఉంది. మునుపటిలా రెచ్చిపోలేదు. రేవంత్ సైతం కామ్ గానే ఉన్నాడు. ఒక్క కీర్తితో మాత్రమే దురుసుగా ప్రవర్తించాడు. మిగతా ఇంటి సభ్యులు కూడా తగిన కారణాలతో ఇంటి సభ్యులను నామినేట్ చేశారు.

    ఈ వారం నామినేషన్స్ చూస్తే..

    శ్రీహాన్- రాజ్, ఇనాయాలను
    సుదీప-ఇనయా, రేవంత్ లను
    గీతూ- చంటి, ఇనాయాలను
    వాసంతి- రేవంత్, సూర్య లను
    ఆరోహి- రేవంత్, ఇనాయాలను..
    శ్రీసత్య-ఇనాయా, రేవంత్ లను
    బాలాదిత్య-సూర్య, రేవంత్ లను..
    ఇనాయా- సుదీప, శ్రీహాన్ లను..
    చంటి- గీతూ, ఇనయా..
    అర్జున్- రాజ్, గీతూ లను
    సూర్య- వాసంతి, ఇనయాలను..
    రేవంత్- శ్రీసత్య, ఆరోహిలను..
    రాజ్ – శ్రీహాన్, ఆరోహిలను..
    మెరీనారోహిత్- సూర్య, ఇనయాలను..
    కీర్తి-ఇనయా, రేవంత్ లను..
    ఫైమా- ఆరోహి, సుదీపలను..
    ఆదిరెడ్డి-ఆరోహి, సుదీపలను నామినేట్ చేశారు.

    నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య పెద్దగొడవలే జరిగాయి. చివరికి ఈ వారం కీర్తి, సుదీప, శవ్రీహాన్, అర్జున్, గీతూ, ఇనాయా, సూర్య,రాజ్, ఆరోహి, రేవంత్ లు మెజార్టీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారని బిగ్ బాస్ ప్రకటించారు.