https://oktelugu.com/

Bigg Boss Telugu 6 Eliminations: బిగ్ బాస్ హౌస్ లో కన్నింగ్ అతడే.. ఈ వారం అభినయశ్రీ ఔట్.. లాస్ట్ లో షాకిచ్చిన నాగార్జున

Bigg Boss Telugu 6 Eliminations: బిగ్ బాస్ లో సండే ఫన్ డే గా మారింది. నాగార్జున రాగానే హౌస్ లోకి హీరోయిన్ తమన్నాను పంపించాడు. తమన్నాతో ఇంటి సభ్యులతో కలిసి ఓ గేమ్ ఆడించాడు. ‘లేడీ బౌన్సర్’ అన్న ఈ గేమ్ లో ఎక్కువమంది ఇంట్లో లేడీ బౌన్సర్ గా ‘గీతూ’కు ఓటు వేశారు. ఆమెనే అందరి నుంచి కాపాడుతుందని ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఇక లేడీ బౌన్సర్ గేమ్ లో ఇంప్రెస్ చేసిన మగ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2022 / 10:34 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 6 Eliminations: బిగ్ బాస్ లో సండే ఫన్ డే గా మారింది. నాగార్జున రాగానే హౌస్ లోకి హీరోయిన్ తమన్నాను పంపించాడు. తమన్నాతో ఇంటి సభ్యులతో కలిసి ఓ గేమ్ ఆడించాడు. ‘లేడీ బౌన్సర్’ అన్న ఈ గేమ్ లో ఎక్కువమంది ఇంట్లో లేడీ బౌన్సర్ గా ‘గీతూ’కు ఓటు వేశారు. ఆమెనే అందరి నుంచి కాపాడుతుందని ఏకగ్రీవంగా ఓటు వేశారు.

    ఇక లేడీ బౌన్సర్ గేమ్ లో ఇంప్రెస్ చేసిన మగ కంటెస్టెంట్ల నుంచి ఒకరిని సెలెక్ట్ చేయమని నాగార్జున ఇంట్లోకి వెళ్లిన హీరోయిన్ తమన్నాకు సూచించాడు. ఈ క్రమంలోనే రేవంత్, సూర్య, అర్జున్, రోహిత్ లను ఎంపిక చేశాడు. ఇందులో మిమిక్రీతో ఎంటర్ టైన్ చేసిన సూర్యను బెస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక చేసిన తమన్నా అతడికి ఒక గిఫ్ట్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

    బిగ్ బాస్ లో మిగిలిన ఏడుగురిలో ఇద్దరిని సేవ్ చేశాడు నాగార్జున. ఈ ఏడుగురితో ఒక గేమ్ ఆడించగా… ఇందులో గలాటా గీతూ, రాజ్ సేఫ్ అయ్యారు. ఇద్దరి బొమ్మలు గ్రీన్ గా రావడంతో ఈ వారం ఎలిమినేషన్ జోన నుంచి బయటపడ్డారు.

    మధ్యలో పాటలతో గేమ్ లు ఆడించాడు నాగార్జున రేవంత్, చలాకీ చంటీల గ్రూపులో విభజించి ‘గజిబిజి గానా’ అంటూ టాస్క్ ఇచ్చాడు. అన్ని పాటలను గుర్తించినందుకు రేవంత్ టీం విజేతగా నిలిచింది.

    మిగిలిన ఐదుగురిలోంచి ఇద్దరిని సేవ్ చేసేందుకు నాగార్జున నామినేషన్ లో ఉన్న వారికి మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో జబర్ధస్త్ ఫైమా , రేవంత్ లు సేవ్ అయ్యారు. వారికి గ్రీన్ కుండీ రావడంతో వారిద్దరూ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు.

    మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లలో ఒకరిని సేవ్ చేసేందుకు నాగార్జున మరో టాస్క్ ఇచ్చాడు. ఇందో మెరినా-రోహిత్ జోడీ సేవ్ అయ్యింది. అభినయ, ఆదిరెడ్డిలకు రెడ్ సింబల్ రావడంతో వారిద్దరూ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించాడు. అభినయశ్రీ, ఆదిరెడ్డిలలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రకటించారు.

    చివరలో మిగిలిన ఇద్దరు ఆదిరెడ్డి, అభినయశ్రీలలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నాగార్జున ప్రాసెస్ మొదలుపెట్టారు. ఇందులో కలర్ కుండీలో రెడ్ కలర్ వచ్చిన అభినయశ్రీని ఈ వారం ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. ఇక ఆదిరెడ్డి ఈ వారం సేవ్ అయినట్టు తెలిపి అతడికి ఊరటనిచ్చాడు.

    ఇక ఈవారం బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. శనివారం షానీని ఎలిమినేట్ చేయగా.. ఆదివారం ఓటింగ్ ప్రకారం తక్కువగా వచ్చిన అభినయశ్రీని ఇంటికి పంపారు. దీంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. గత వారం ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈ వారం ఏకంగా ఇద్దరిని తొలగించడం సంచలనమైంది.

    ఈ ఆదివారం ఎలిమినేట్ అయిన అభినయశ్రీతో ‘హానెస్ట్-డిస్ హానెస్ట్’ టాస్క్ ను ఆడించాడు నాగార్జున. ఇందులో హానెస్ట్ ఇంటి సభ్యులు, డిస్ హానెస్ట్ ఇంటిసభ్యులు ఎవరో గుర్తించాలని అభినయశ్రీకి టాస్క్ ఇచ్చాడు.

    ఇందులో బిగ్ బాస్ హౌస్ లో హానెస్ట్ గా ఫైమా, చలాకీ చంటి, శ్రీసత్య, బాలాదిత్య, సూర్యలు ఉంటారని.. వీరే నిజాయితీపరులు అని అభినయశ్రీ చెప్పుకొచ్చింది.

    ఇక డిస్ హానెస్ట్ గా రేవంత్ ఉంటారని.. అతడు కన్నింగ్ గా వ్యవహారిస్తాడని.. సో నిజాయితీగా లేని వ్యక్తిగా రేవంత్ ను నామినేట్ చేసింది. ఇక గీతూ బాగా ఆడుతోందని.. టాప్ 3లో గీతూ ఖచ్చితంగా ఉంటుందని అభినయశ్రీ అంచనావేసింది.

    ఇక వెళుతూ వెళుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు చెత్తగా ఆడుతున్నారని.. ఇకనైనా ఫైర్ తో ఆడాలని చెప్పి ముగిస్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కావడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.