Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ విజేతగా గెలవాలంటే ముందు కావాల్సింది ‘కామ్ అండ్ సిన్సియారిటీ’. ప్రత్యర్థులందరూ టార్గెట్ చేసి హింసించినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఎవరూ స్నేహితులు లేకున్నా ఒంటరిగానైనా పోరాడుతూ కనిపించాలి. వారే విజేతగా నిలుస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటికీ 5 సీజన్లు జరిగాయి. ఈ ఐదుగురు విజేతలను గమనిస్తే వారంతా ‘ఒంటరి పోరాట’ యోధులే. బలమైన ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే సానుభూతితో గెలిచినవాళ్లే. హృదయాన్ని హత్తుకునే బంధాలను ఏర్పరుచుకున్న వారే. తమ మంచితనంతోనే విజయాలను అందుకున్న వాళ్లే. వీరి అందరిలో ఒకటే కామన్ పాయింట్ ఉంది. వీరంతా ‘సైలెంట్’గా తాము ఉన్నట్టే ఉండడం.. ఎదుటివారిపై చాడీలు చెప్పకపోవడం.. సిన్సియర్ గా తమ ఆట మాత్రమే తాము ఆడడం.. ఒంటరిగా పోరాడడం.. బంధాలకు ప్రాణమివ్వడం.. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం… అదే వారిని విజేతలుగా నిలిపింది.
బిగ్ బాస్ 1 విజేత శివబాలాజీ ఆ ఇంట్లో అందరికీ వండిపెట్టి అందరి మంచితనాన్ని సంపాదించి టైటిల్ విన్నర్ అయ్యాడు. ముక్కోపి అయినా అతడి ప్రేమ ఒక సముద్రంలా అందరినీ తడిపేసింది. ఒంటరిగానే అతడు చివరి వరకూ ఆడాడు. హరితేజతో మాత్రమే అతడు సిన్సియర్ గా స్నేహాన్ని కొనసాగించాడు. వారి స్వచ్ఛమైన అభిమానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చివరి వరకూ ఎలాంటి ఎమోషన్స్ కు లొంగకుండా నిలబడ్డ శివబాలాజీని విజేతగా నిలిపారు.
బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మందా కూడా అంతే.. ఆయనకు వ్యతిరేకంగా హౌస్ అంతా ఏకమై వేధించారు.. వేటాడారు. కానీ ఒక్కడే ఒంటరిగా పోరాడాడు. హౌస్ లో ఎవరిపైనా ఆధారపడకుండా.. ఎవరినీ ఏమీ అనకుండా తన ఆట తను ఆడాడు. ఈ క్రమంలోనే సింపతీ తెచ్చుకొని ప్రేక్షకుల మనసు గెలిచి విజేత అయ్యాడు. ఒంటరితనంతో సిన్సియర్ గా ఆడడమే ఇతడి విజయానికి కారణమైంది. ప్రత్యర్థులంతా ఏకమై కక్షసాధించడంతో ఇతడిపై ప్రేక్షకులు సానుభూతి పెరిగి అభిమానం వరదలా మారి ఓట్ల వర్షం కురిపించి విజేతను చేసింది..
బిగ్ బాస్ 3 విజేతగా అందరూ ముందుగా అనుకున్నది యాంకర్ శ్రీముఖినే. కానీ ఆమె ఇగోలకు పోయి.. నోరు పారేసుకొని అనవసరంగా టైటిల్ చేజార్చుకుంది. ఇదే సమయంలో ఓపికగా ఉండి.. శ్రీముఖికి టార్గెట్ గా మారి.. ఎవరిని పల్లెత్తు మాట అనకుండా.. విమర్శించకుండా.. హౌస్ లో ప్రేమతో అందరి మనసులు గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విజేతగా నిలిచాడు. ఇతడిలో ఉన్న విశేషం ఏంటంటే..? రాహుల్ అసలు ఎప్పుడూ ఫిజికల్ టాస్క్ లు ఆడలేదు. గెలవలేదు. బిగ్ బాస్ గేమ్ లు ఆడమని చెప్పినా లెక్క చేయలేదు. కానీ తన మంచి మనసు.. ప్రేమామృతంతో విజేతగా గెలిచాడు.
బిగ్ బాస్ 4 విజేత అభిజీత్ కూడా కామ్ అండ్ కూల్. ఎంత మంది రెచ్చగొట్టినా.. మిన్ను విరిగి మీదపడ్డా చలించని అతడి తత్వమే విజేతగా నిలిపింది. అభిజీత్ కూడా ఫిజికల్ టాస్క్ లు ఆడలేదు. గెలవలేదు. అతడి బాడీ పర్సనాలిటీ కూడా చాక్లెట్ బాయ్ లా ఉండేది. ఇక ఎమోషన్స్ ను బాగా కంట్రోల్ చేసుకునేవాడు. దేత్తడి హారికతో ఇతడి ప్రేమ, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇతడి ప్రశాంత చిత్తం.. సిన్సియారిటీనే విజేతగా నిలిపింది.
బిగ్ బాస్ 5 సీజన్ విజేత కూడా అనూహ్యమే. అందరూ యాంకర్ రవిని విజేతగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రవిలోని నక్కజిత్తులే అతడికి ఎసరు తెచ్చాయి. అతడి గుణాన్ని బయటపెట్టాయి. ప్రేక్షకులకు ఈ గుణమే రవిని దూరం చేసింది. అదే సమయంలో సిన్సియర్ గా.. గేమ్ ను ప్రాణంగా ఆడుతూ.. ఫ్రెండ్ షిప్ కు ప్రాణమిస్తూ.. కామెడీ పంచుతూ.. అసలైన ప్రాణ మిత్రుడికి కొత్త అర్థాన్ని చెప్పిన సన్నీ బిగ్ బాస్ 5 విజేతగా నిలిచాడు.
Also Read: KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ ఆంతర్యమేమిటో?
ఈ ఐదుగురు విజేతలందరిలోనూ ఒకటే పాయింట్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో నీతి నిజాయితీగా ఆడినవారే గెలిచారు. ఎవరిపైనా ఇగోకు పోకుండా.. ఎదుటివారిని కించపరచకుండా తమ గేమ్ తాము మాత్రమే ఆడారు. సిన్సియారిటీని ప్రదర్శించారు. టాస్క్ లు ఆడకున్నా ప్రేక్షకుల మనసును తమ ప్రవర్తనతో గెలిచారు. ఎదుటివారు ఎంత కవ్వించినా ఎక్కడ తమ భావోద్వేగాలను లూజ్ కాకుండా కంట్రోల్ చేసుకున్నారు. ప్రేమను.. స్నేహాన్ని 100శాతం పంచారు. ఇదే బిగ్ బాస్ విజయ రహస్యం..
ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లోనూ బిందుమాధవి అలానే వ్యవహర్తిస్తోంది. ఆమె విజయ రహస్యం కూడా ఇదే.. కూల్ అండ్ కామ్.. ఓటీటీ నాన్ స్టాప్ లో బిందుమాధవి ఇప్పటివరకూ ఫిజికల్ టాస్క్ లు తను ఆడింది లేదు.. ఇంతవరకు ఒక్కసారి కూడా గేమ్ లో గెలవలేదు. ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. ఇంట్లో శివ తప్పితే ఫ్రెండ్స్ కూడా లేరు. ఒంటరిపోరాటం చేస్తోంది. అదీ సిన్సియర్ గా చేస్తోంది. అఖిల్ లాంటి బలమైన కంటెస్టెంట్ ఉన్నా.. అతడు ఇతరులపై ఆధారపడి తన గేమ్ ను ఆడుతుంటాడు. కానీ ఎన్ని కష్టాలు, కన్నీళ్లు వచ్చినా బిందుమాధవి గ్రూపిజం కట్టలేదు. ఎదుటివారిపై ఆధారపడలేదు. తన ఫ్రెండ్ అయిన శివను కూడా గొడవలు వచ్చి ఒకసారి నామినేట్ చేసింది. యుద్ధంలో ఒంటరిగా.. నిక్కచ్చిగా పోరాడితేనే విజయం దక్కుతుందని ఒక యోధురాలిలా నిలబడింది.
నటరాజ్ మాస్టర్ సహా కొంతమంది ఎంత కవ్వించినా.. వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి విమర్శలు చేసిన బింధుమాధవి బెదరలేదు.. భయపడిపారిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. ఇంట్లోని అఖిల్ గ్రూప్ ఎంత టార్గెట్ చేసి హింసించినా సరే వాటిని మొండిపట్టుదలతో ఎదుర్కొంది. ఇంతమంది ఒక ఆడకూతురిపై ఇంతలా వ్యవహరించడమే ప్రేక్షకుల్లో బిందుమాధవిపై సానుభూతికి కారణమైంది. ఆమెకు ఇదే ఓట్ల వర్షం కురిపిస్తోంది. జనాలు ఇందుకే బిందును ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఈ సమాజంలో ఎవరైతే వివక్షకు గురి అవుతారో వారే ఫైటర్ లు అవుతారు.. ‘కేజీఎఫ్2’ కూడా అలాంటి కథనే. అందుకే అంతలా ఆడింది.. ఈ థీమ్ ప్రేక్షకులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఒంటరితనం.. సిన్సియారిటీతో కూడిన నీతి నిజాయితీనే బిందుమాధవిని బిగ్ బాస్ ఓటీటీ విజేత దిశగా అడుగులు వేయిస్తోంది. ఆమె మొండిపట్టుదల.. ధైర్యమే ముందుకు నడిపిస్తోంది. మనమూ బిందుమాధవి స్ఫూర్తిదాయ పోరాటాన్ని ప్రశంసిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Also Read: Chandamama Movie: ‘చందమామ’ సినిమాలో నుంచి ఆ స్టార్ హీరోని తీసేశారు ?
Recommended Videos