https://oktelugu.com/

Bigg Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ పేరు లీక్..? ఎవరంటే?

Bigg Boss Non Stop Winner: ఓటీటీ వేదికగా సాగుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సీజన్ విన్నరెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే ఇప్పటికే విజేత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కొందరు గురువారమే ఈ విషయాన్ని డిక్లేర్ చేశారని అంటున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. అయినా ఫైనల్ గా జరిగేదిదే అని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ వ్యూహార్స్ కాస్త గందరగోళానికి గురవుతున్నారు. ఓటింగ్ శాతాన్ని బట్టి విన్నర్ లేడీ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2022 / 12:12 PM IST
    Follow us on

    Bigg Boss Non Stop Winner: ఓటీటీ వేదికగా సాగుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సీజన్ విన్నరెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే ఇప్పటికే విజేత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కొందరు గురువారమే ఈ విషయాన్ని డిక్లేర్ చేశారని అంటున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. అయినా ఫైనల్ గా జరిగేదిదే అని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ వ్యూహార్స్ కాస్త గందరగోళానికి గురవుతున్నారు. ఓటింగ్ శాతాన్ని బట్టి విన్నర్ లేడీ అని అంటుండగా.. ఫైనల్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు టీవీల్లో వచ్చిన బిగ్ బాస్ షో లకంటే ఓటీటీ వేదికగా సాగుతున్నఈ షో పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    akhil sarthak, bindu madhavi

    దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో బిగ్ బాస్ షో రన్ అవుతోంది. కానీ తెలుగులో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా మిగతా లాంగ్వేజేస్ కంటే తెలుగులో టీఆర్పీరేట్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాహాకులు కూడా వ్యూహార్స్ కు అనుగుణంగా షో పై అంచనాలు భారీగా పెంచేశారు. టీవీల్లో ప్రసారమైన 5 సీజన్లు సక్సెస్ అయ్యాయి. మొదటిసారి ఓటీటీ పై స్ట్రాట్ చేయడంతో ముందుగా కాస్త అనుమానాలుండేవి. కానీ అనుకున్నదానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు, గేమ్స్ వ్యూహర్స్ ను ఆకట్టుకున్నాయి. కంటెస్టెంట్లు వాటిని పోటా పోటీగా టాస్క్ లు పూర్తి చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

    Also Read: Mahesh Babu: మహేశ్ బాబును ఏడిపించిన సినిమా ఏది?

    ఇప్పటి వరకు రన్ అయిన షో ల కంటే ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ భిన్నంగా సాగింది. ఇందులో ముందుగా 17 మంది కంటెస్టెంట్లు జాయిన్ అయ్యారు. వీరిలో పాతవారు కూడా ఉన్నారు. కొత్తవారూ సైతం తమ ప్రతిభను చూపించారు. ఎలిమినేషన్లో భాగంగా 8 మంది హౌస్ నుంచి బయటకు వెళ్లగా ఏడుగురు మిగిలారు. అయితే ముందుగా ఫైనల్ కు ఏడుగురిని పంపాలని నిర్ణయించారు. కానీ చివరి స్థానంలో ఉన్న అనిల్ రాథోడ్, ఆరో స్థానంలో ఉన్న బాబా భాస్కర్, ఐదో ప్లేసులో ఉన్న మిత్రా శర్మ బయటకు వచ్చారు. మిగిలిన వారిలో ఇద్దరి మధ్యే పోటీ నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది.

    Bigg Boss Non Stop

    మొదటి నుంచి పోటాపోటీగా కొనసాగుతున్న బిందుమాధవి, అఖిల్ సార్థక్ లల్లో ఎవరో ఒకరు విజేతగా నిలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే బిందుమాధవి విన్నర్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. శుక్రవారం రాత్రే ఈ ప్రక్రియ పూర్తయినట్లు పోస్టులు పెడుతున్నారు. కానీ అఫియల్ గా ఫలితాలు తారుమారు అయ్యే అయ్యే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అఫిషియల్ ఓటింగ్ శాతంలో తేడాలుంటాయని అంటున్నారు. కానీ టాస్క్ లు, గేమ్స్ ప్రకారం బిందుమాధవికే ఎక్కువ శాతం ఓటింగ్ ఉందని అంటున్నారు. మరోవైపు అసాధారణ ఆటతో తన ప్రతిభను చూపిస్తున్న యాంకర్ శివ మూడో స్థానంలో ఉన్నాడని అంటున్నారు.

    ఇదిలా ఉండగా బుధవారంతోనే టాస్క్ లను క్లోజ్ చేశారు. ఆ తరువాత రోజు నుంచి జర్నీ వీడియోలను ప్రచారం చేశారు. ఇందులో అందరి కంటెస్టెంట్ల వీడియోలను చూపించారు. అలాగే గార్డెన్ ఏరియాలో డిన్నర్ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేశారు. ఆ తరువాత పాటలు, డ్యాన్స్ లతో ఉత్సాహంగా గడిపారు. ఇక విన్నర్ ఎవరనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లీకులను బట్టి బిగ్ బాస్ విజేతగా బిందుమాధవినే అని అంటున్నారు. మరి బిగ్ బాస్ ఎవరిని ఎంపిక చేస్తాడో చూడాలి.

    Also Read: Captain Chalapati Choudhary : ఎన్టీఆర్ పై అభిమానం.. నూతన్ ప్రసాద్ తో సాన్నిహిత్యం !
    Recommended Videos


    Tags