Bigg Boss Non Stop Voting Results: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ 1 చివరి అంకానికి చేరింది. ఇప్పుడు విన్నర్ ఎవరనేది తెలిసిపోయింది. ప్రస్తుతం ఇద్దరు కంటెస్టెంట్ల మధ్యనే హోరాహోరీగా పోటీ సాగుతోంది. బిందుమాధవి వర్సెస్ అఖిల్ ల మధ్యలోనే విన్నర్ ఎవరో డిసైడ్ అవ్వబోతోందని ఓటింగ్ ట్రెండింగ్ ను బట్టి తెలుస్తోంది. అన్ అఫీషియల్ ఓటింగ్ లో కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఓటింగ్ ఫైట్ సాగుతోంది. సోషల్ మీడియా సెలబ్రెటీలు షణ్ముఖ్-దీప్తి సునైనా సహా కొంత మంది బుల్లితెర ప్రముఖులు అఖిల్ సార్ధక్ కోసం రంగంలోకి దిగడంతో అతడి ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరుగుతోంది. కానీ బిందుమాధవికి అశేష ప్రజానీకం మద్దతు ఉండడంతో ఆమెనే ప్రస్తుతానికి టాప్ లో కొనసాగుతోంది.
డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ అనధికార పోలింగ్ లలో బిందుమాధవి ప్రస్తుతానికి నంబర్ 1గా దూసుకుపోతోంది. ఇక కొన్ని వెబ్ సైట్స్ కు వచ్చేసరికి అఖిల్ సార్థక్ బిందుతో సమానంగా ఓట్లు పొందుతున్నాడు. దీన్ని బట్టి బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నది చివరి వరకూ కూడా ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈనెల 21న బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే జరుగబోతోంది. ఒక్కరోజు ముందే విన్నర్ ఎవరన్నది డిసైడ్ అయిపోతుంది. హాట్ స్టార్ లో ఇది లైవ్ పెట్టే విధంగా ఇప్పుడు బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోంది. చివరి విన్నర్ ఎవరన్నది ఆపేసి దాన్ని సండే రోజు లైవ్ ఎపిసోడ్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విన్నర్ ను కేవలం ప్రసారానికి రెండు-మూడు గంటల ముందే తెలిసేలా ఈసారి ఉత్కంఠభరింతంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అనధికార పోలింగ్ సైట్స్ ను ఒక్కసారి చూస్తే బిందుమాధవికి, అఖిల్ కు మధ్య కేవలం 3 నుంచి 4 శాతం వరకూ మాత్రమే ఓట్ల తేడా ఉంది. వెబ్ సైట్లలో అఖిల్ లీడ్ లో ఉండగా.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లలో బిందుమాధవి లీడింగ్ లో ఉంది. అకిల్ కు 56శాతం ఓటింగ్ శాతం ఉంటే బిందు మాధవికి 34శాతం ఓటింగ్ వెబ్ సైట్లలో ఉంది. ఇక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓటింగ్ లో బిందుకు 44శాతం ఓటింగ్ వస్తే.. అఖిల్ కు 39శాతం మద్దతు కనిపిస్తోంది.
ఇక ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టి చూస్తే బిగ్ బాస్ కు తొలి లేడీ విన్నర్ గా బిందుమాధవి నిలవడం ఖాయమని.. ఆమెనే విన్నర్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఆమె తర్వాత అఖిల్, యాంకర్ శివలు కొనసాగుతున్నారు.
మొదటి స్థానంలో బిందు, రెండోస్థానంలో అఖిల్ మధ్య ఓటింగ్ తేడా చాలా స్వల్పంగా ఉంది. దీంతో విన్నర్ ఎవరన్నది ఈ ఇద్దరిలోనే ఉండనుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి బిగ్ బాస్ టీం లేడీ విన్నర్ ను ప్రకటించడం ఖాయమని.. బిందుమాధవినే విజేతగా ప్రకటిస్తారని అంటున్నారు. అఖిల్ ఈసారి కూడా రన్నరప్ గానే నిలుస్తాడని ప్రచారం సాగుతోంది.
Also Read:Mahesh Babu vs Mega Fans: ‘మెగా- మహేష్’ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుందా ? ఎందుకు ఈ సీన్ ?
Recommended Videos