https://oktelugu.com/

Bigg Boss OTT: టార్గెట్ బిందు.. చివరకు శివ కూడా అఖిల్ బ్యాచ్ తో కలిసిపోయాడా?

Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. ఈ సోమవారం నామినేషన్స్ సెగ పుట్టించాయి. ఇప్పటికే ఏడు వారాల్లో ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. నాన్ స్టాప్ షోలో పాత పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈ షోకు ఆదరణ బాగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఓటీటీ షోలో బోల్డ్ కంటెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ప్రత్యర్థులైన బింధుమాధవి-శివలను టార్గెట్ చేసి నోరుపారేసుకుంటోంది. బిందుమాధవి షో ప్రారంభం […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2022 / 09:08 PM IST
    Follow us on

    Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. ఈ సోమవారం నామినేషన్స్ సెగ పుట్టించాయి. ఇప్పటికే ఏడు వారాల్లో ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. నాన్ స్టాప్ షోలో పాత పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈ షోకు ఆదరణ బాగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఓటీటీ షోలో బోల్డ్ కంటెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ప్రత్యర్థులైన బింధుమాధవి-శివలను టార్గెట్ చేసి నోరుపారేసుకుంటోంది.

    బిందుమాధవి షో ప్రారంభం నుంచి యాంకర్ శివతో క్లోజ్ గా ఉంటోంది. అతడితోనే మాట్లాడుతూ.. ఆడుకుంటూ కనిపిస్తోంది. అలాగే శివకు మద్దతుగా పలుమార్లు కొందరితో గొడవలు కూడా పెట్టుకుంది. వీళ్లద్దరి స్నేహం బిగ్ బాస్ లో ఎవర్ గ్రీన్ ముందుకు సాగుతోంది.

    ఇక బిందుమాధవిపై పగను పెంచుకున్న అఖిల్.. అతడి బ్యాచ్ వీరిని దెబ్బకొట్టడానికి ప్రతీసారి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. బిందుమాధవితో అఖిల్ బ్యాచ్ అయిన ‘నటరాజ్, ఆషు, అజయ్’లు గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఎన్నో వివాదాలు చెలరేగాయి.

    ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయిపోగా.. తాజాగా ఎనిమిదో వారంలో ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులోనూ అఖిల్ బ్యాచ్ అంతా బిందుమాధవిని టార్గెట్ చేసి ఆమెను నామినేట్ చేశారు. కెప్టెన్ అయిన శివ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

    అయితే హౌస్ లోని వారంతా బిందుమాధవిని నామినేషన్స్ లో టార్గెట్ చేశారు. ఆమె ‘గర్ల్’ కార్డ్ వాడి సానుభూతి పొందుతోందని అఖిల్ సహా వారి బ్యాచ్ సభ్యులు ఆరోపిస్తారు. అయితే దీన్ని కెప్టెన్ అయిన శివ ఖండించకపోగా.. అఖిల్ ఉచ్చులో పడి బిందుమాధవినే తప్పు పడుతాడు..

    ఈ నామినేషన్స్ ముగిశాక.. తనకు సపోర్ట్ చేయకుండా అఖిల్ బ్యాచ్ కు సపోర్టు చేయడంపై శివను బిందుమాధవి నిలదీస్తుంది. ఎందుకిలా చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తుంది. అయితే ‘నీ ప్రశ్నకు నువ్వు జవాబు ఇచ్చుకోవడం లేదని.. రాంగ్ పాయింట్ రేజ్ చేసి దాన్ని కవర్ చేసుకోలేదని.. నేనేలా కవర్ చేస్తానంటూ’ బిందుమాధవిని తప్పు పడుతాడు శివ. ఈ క్రమంలోనే నేను తప్పు చేసినట్టు ఫోకస్ చేస్తావా? శివ నీకు పిచ్చిపట్టిందా? వాళ్ల ఉచ్చులో పడిపోయావా? అంటూ బిందు నిలదీస్తుంది.

    ఇలా ఇన్నాళ్లు బిందుమాధవికి సపోర్టుగా హౌస్ లో నిలబడ్డ శివ కూడా అఖిల్ బ్యాచ్ ఉచ్చులో పడి వారికి అనుకూలంగా మారిపోవడం ప్రేక్షకులకు.. ఇటు బిందును కూడా షాక్ కు గురిచేసింది. బిందు ని అందరూ కలిసి కార్నర్ చేస్తుంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడాల్సింది పోయి శివ కూడా ఆ బ్యాచ్ తో కలిసిపోయాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బిందుకు జిగ్రీ దోస్త్ అయిన శివ ఇలా మారిపోవడంపై నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

    https://www.youtube.com/watch?v=Wh1iUmWClPg