
ఇప్పటివరకు బిగ్‌బాస్ ఏ సీజన్‌ను కూడా లేడీ కంటెస్టెంట్స్ గెలుచుకోకున్నా.. చివరి వరకూ గట్టి పోటీనే ఇచ్చారు. గతంలో జరిగిన మూడు సీజన్లలోనూ ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా స్ట్రాంగ్‌గా ఉండేది. మొదటి సీజన్‌లో హరితేజ, రెండో సీజన్‌లో గీతా మాధురి, మూడో సీజన్‌లో శ్రీముఖి ఉండడంతో టాప్ ఫైవ్ ప్లేస్‌ల్లో నిలిచారు.
అయితే.. బిగ్‌బాస్ 4 సీజన్‌ను చూస్తే లేడీ కంటెస్టెంట్ల మీద రందీ స్టార్ట్ అయిందంట. ఈ సీజన్లో ఆడవారు ఎవరూ స్ట్రాంగ్‌గా లేరు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పినందుకు టీవీ9 దేవి మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వారిలో ఎవరికీ బిగ్‍బాస్ ఆడే సత్తా ఉన్నట్టు కనిపించడం లేదు.
వరుసగా నాలుగు వారాలలో నలుగురు లేడీ కంటెస్టెంట్లు బయటికి వచ్చేశారు. ఆదివారం సుజాత కూడా ఎలిమినేట్ అయింది. దీంతో వరుసగా ఐదుగురు బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లోని మోనల్ గజ్జర్ మ్యానిప్యులేటివ్ అని ఆడియన్స్ పసిగట్టడంతో ఆమెకు సరిగా ఓట్లు పడడం లేదు. హారిక ఏమో అభిజీత్ వెనుక, అరియానా ఏమో అవినాష్ వెంట ఉంటూ ఫుటేజీ కోసం చూస్తున్నారు.
యాంకర్ లాస్యకి అనుకోని షాకులు తగలుతుండడంతో ఆమె సైలెంట్ అయిపోయింది. దీంతో తన ఓట్ షేర్ బాగా పడిపోయింది. దివి యూత్‍ని ఆకట్టుకున్నా అమ్మ రాజశేఖర్ ప్రభావంలో పడి వెనకబడిపోయింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వారిలో ఫైనల్ ఫైవ్ చేరతారని అనిపిస్తున్న వారిలో అందరూ మగాళ్లే. బిగ్‍బాస్ పట్టుబట్టి లేడీస్‍ని కాపాడుకుంటే తప్ప ఫైనల్ ఫైవ్ కంటే ముందే ఆడాళ్లంతా ఎలిమినేట్ అయిపోయే ప్రమాదం ఉంది. నెక్ట్స్ సీజన్‌కు ఆడవారి నుంచి సపోర్టు రావాలంటే.. కంటెస్టెంట్లుగా ఆడవారిని తీసుకోవాలంటే.. వారితో ఇంకొన్ని రోజులు బిగ్‌బాస్ గేమ్ ఆడించాల్సిందే.