Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6లో ఇనాయ సుల్తానా ఓ సెన్సేషన్. లవ్ ఎఫైర్ ఓపెన్ గా నడిపి ఈమె కంటెస్టెంట్స్ ని ఆకర్షించారు. ఇనాయ సుల్తానా గట్స్ కి ఆడియన్స్ షాక్ అయ్యారు. కంటెస్టెంట్ సూర్యతో ఇనాయ స్ట్రాంగ్ లవ్ స్టోరీ నడిపించింది. ఒకే కంచం ఒకే మంచం అన్నంత వరకు మేటర్ వెళ్ళింది. కన్ఫెషన్ రూమ్ లో ఇనాయ సూర్య అంటే నాకు ఇష్టం అని బిగ్ బాస్ కి చెప్పింది. అప్పటి నుండి హౌస్లో అతడంటే ప్రాణంగా బ్రతికింది. ఒక దశలో గేమ్ వదిలేసి సూర్య చుట్టూ తిరిగింది.
చివరకు హోస్ట్ నాగార్జున హెచ్చరించాల్సి వచ్చింది. దాంతో కొన్నాళ్ళు దూరంగా ఉన్నట్లు నటిద్దామని ఒప్పందం చేసుకున్నారు. ఈ నాటకంలో భాగంగా ఇనాయ తన లవర్ సూర్యను నామినేట్ చేసింది. అనూహ్యంగా అదే వారం ఇనాయ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో ఇనాయ బాగా హర్ట్ అయ్యింది. మొత్తుకుని ఏడ్చింది. సూర్య ఎలిమినేషన్ అనంతరం ఇనాయ సూర్య జ్ఞాపకాలతో బ్రతికేసింది. అతని వాడిన వస్తులను అపురూపంగా చూసుకుంది.
ఇనాయలో ప్రేక్షకులకు నచ్చిన మరొక గుణం ముక్కుసూటితనం. అది ఎవరైనా తప్పు అనిపిస్తే ఇనాయ ప్రశ్నిస్తుంది. ఈ గుణం కారణంగా ఆమె పలుమార్లు హౌస్లో ఒంటరి అయ్యారు. అయినా తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. రోజులు గడిచే కొద్దీ ఇనాయకు ఫ్యాన్ బేస్ ఎక్కువైంది. ఒక దశలో ఆమె టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. అనూహ్యంగా ఫైనల్ కి ముందు ఇనాయ ఎలిమినేట్ అయ్యారు.
ఇనాయ ఎలిమినేషన్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో షోను ట్రోల్ చేశారు. టాప్ కంటెస్టెంట్ కనీసం ఫైనల్ కి కూడా వెళ్లకపోవడమేంటని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఇనాయను బలి చేశారన్న కామెంట్స్ వినిపించాయి. బిగ్ బాస్ షో ఇనాయకు మంచి ఫేమ్ తెచ్చింది.
కాగా ఇనాయను వెలుగులోకి తెచ్చిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఓ పార్టీలో వర్మ-ఇనాయ చిల్ అవుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ దెబ్బతో ఇనాయ పేరు మారుమ్రోగింది. బిగ్ బాస్ షోలో ఇనాయకు ఆఫర్ వచ్చింది కూడా వర్మ కారణంగానే. బిగ్ బాస్ హౌస్లో ఉండగా వర్మ ఆమెకు మద్దతుగా పోస్ట్స్ పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అమ్మడు హాట్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. బాత్ రూమ్ లో సెల్ఫీలు దిగి పబ్లిక్ కి షేర్ చేసింది. ఇనాయ ప్రైవేట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.