Bigg Boss 6 Telugu- Superstar Krishna: రోజుకో మలుపు తీసుకుంటూ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తూ ముందుకి దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు 12 వ వారం లోకి అడుగుపెట్టింది..ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్కు ఎంతో ఆసక్తికరంగా సాగింది..హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరికి రేవంత్ గెలిచి రెండవసారి ఇంటి కెప్టెన్ అయ్యాడు..ఈ కెప్టెన్సీ టాస్కులో చివరిగా మిగిలింది స్నేహితులైన రేవంత్ మరియు శ్రీహాన్లే..స్నేహితులైనప్పటికీ కూడా వీళ్లిద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఆడగా చివరిగా రేవంత్ శ్రీహాన్ ని ఓడించి ఇంటి కెప్టెన్ అయ్యాడు..స్నేహితుడిని ఓడించినందుకు రేవంత్ చాలా ఫీల్ అయ్యాడు.

శ్రీహాన్ ని హత్తుకొని క్షమాపణలు కూడా చెప్పాడు..అలా ఈ వారం కెప్టెన్సీ టాస్కు ముగిసింది..అయితే గత కొద్దివారాలతో పోలిస్తే ఈసారి కెప్టెన్సీ టాస్కులో కంటెస్టెంట్స్ మధ్య హీట్ వాతావరణం అయితే నడవలేదు..ఇక ఈ వారం నామినేషన్స్ లో ఇంటి కెప్టెన్ ఫైమా మరియు రాజ్ మినహా మిగిలిన 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు..వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవ్వగానే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికి సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయిన విషయం తెలియచేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతాడు..ఇంటి సభ్యులందరు పైకి లేచి రెండు నిమిషాల పాటు కృష్ణ గారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తారు..ఇక ఈ వార్త తెలుసుకొని ఇంటి సభ్యులందరు బాగా ఎమోషనల్ అవుతారు..ముఖ్యంగా రేవంత్ మరియు శ్రీ సత్య కంటతడి పెడుతారు..ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కు మొదలు అవుతుంది..ఇక ఈ బిగ్ బాస్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించే అక్కినేని నాగార్జున మాత్రం కృష్ణ గారిని చివరిసారి కూడా చూడలేకపోయాడు..గోవా లో ఉండడం వల్ల ఆయన కృష్ణ గారి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

అయితే కోట్లాది మంది ఉన్న తెలుగు రాష్ట్రాలను పాలించే ముఖ్యమాంత్రులు సైతం తమ విలువైన సమయాన్ని కృష్ణ గారి కోసం త్యాగం చేసి వస్తే..నాగార్జున గారికి మాత్రం ముఖ్యమంత్రులను మించి పనులు ఏమైనా ఉన్నా ఏంటి అంటూ అభిమానులు తప్ప్పు పడుతున్నారు..మరి దీనికి నాగార్జున వివరణ ఇస్తాడా లేదా అనేది చూడాలి.