Divi Vadthya: పెదాలు కొరుకుతూ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ దివి… కుర్రాళ్లకు నిద్రపడితే ఒట్టు

Divi Vadthya: బిగ్ బాస్ షో దివి వాడ్త్య ఫేట్ మార్చేసింది. ఆమెకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. హైదరాబాద్ కి చెందిన దివి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. నటి కావాలనే ఆశతో షార్ట్ ఫిల్మ్ లో నటించారు. అడపాదడపా చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సీజన్ 4లో దివి పాల్గొన్నారు. దివి హౌస్లో చాలా సైలెంట్ గా ఉండేవారు. అవసరమైతే తప్పా మాట్లాడేది కాదు. సెన్సేషన్ […]

Written By: Shiva, Updated On : March 4, 2023 9:42 am
Follow us on

Divi Vadthya

Divi Vadthya: బిగ్ బాస్ షో దివి వాడ్త్య ఫేట్ మార్చేసింది. ఆమెకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. హైదరాబాద్ కి చెందిన దివి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. నటి కావాలనే ఆశతో షార్ట్ ఫిల్మ్ లో నటించారు. అడపాదడపా చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సీజన్ 4లో దివి పాల్గొన్నారు. దివి హౌస్లో చాలా సైలెంట్ గా ఉండేవారు. అవసరమైతే తప్పా మాట్లాడేది కాదు. సెన్సేషన్ చేయని వాళ్లకు హౌస్లో చోటు ఉండదు. అందుకే దివి కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యారు.

Divi Vadthya

అయితే తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షో అనంతరం దివి దశ తిరిగింది. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. గత ఏడాది దివి రెండు చిత్రాల్లో నటించారు. చిరంజీవి పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ చిత్రంలో ఒక రోల్ చేశారు. అలాగే జిన్నా చిత్రంలో ఆమె కీలక పాత్ర చేయడం విశేషం. హీరో చిన్నప్పటి ఫ్రెండ్ మూగ అమ్మాయిగా దివి నటించి మెప్పించారు.

దివికు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో అధికంగా ఆఫర్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్లలో నటిస్తూ అలరిస్తున్నారు. క్యాబ్ స్టోరీస్, మా నీళ్ల ట్యాంక్ వంటి సిరీస్లలో నటించారు. ఇటీవల విడుదలైన ఏటీఎం సిరీస్లో కీలక రోల్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ సన్నీ, సుబ్బరాజ్ ప్రధాన పాత్రలు చేసిన ఈ సిరీస్ కి దర్శకుడు హరీష్ శంకర్ స్టోరీ అందించడం విశేషం. జీ 5 లో స్ట్రీమ్ అవుతున్న ఏటీఎం సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Divi Vadthya

ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిత్రాలు, సిరీస్లు ఉన్నట్లు సమాచారం. బిగ్ బాస్ షోకి వెళ్లే వరకు దివి అనే ఒక తెలుగు అమ్మాయి నటిగా ఉన్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక దివి పక్కా హీరోయిన్ మెటీరియల్. మంచి హైట్, స్లిమ్ అండ్ ఫిట్ బాడీతో కత్తిలా ఉంటారు. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని ఈ బ్యూటీని టాలీవుడ్ మేకర్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పొచ్చు.

Divi Vadthya

అందుకే తనలోని గ్లామర్ యాంగిల్ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ కి సిద్ధమని హింట్ ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో దివి హాట్ ఫోటో షూట్స్ సెగలు రేపుతుంటాయి. తాజాగా ఎర్ర చీర కట్టి కవ్వింపు చర్యలకు దిగింది. పెదాలు కొరుకుతూ కొంటెగా చూసింది. ఆమె చూపులు కుర్రాళ్ళ గుండెలు జారిపోతున్నాయి. దివి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీ గా ఫీల్ అవుతున్నారు.