Bigg Boss 6 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 6 ఎన్నో ఊహించని మలుపులతో ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టింది..గత వారం లో ఇనాయ ఎలిమినేషన్ పెద్ద దుమారమే రేపింది..ప్రేక్షకుల్లో ఈ రియాలిటీ షో పై పూర్తిగా నమ్మకం పొయ్యేలా చేసింది ఈ ఎలిమినేషన్..ఈ సీజన్ లో జరిగిన ఎలిమినేషన్స్ మొత్తం అలాంటివే..ఇప్పుడు హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీ సత్య , శ్రీహాన్ , రోహిత్ , కీర్తి మరియు ఆది రెడ్డి నిలిచారు..వీరిలో ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారు అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్..ఇంతకు ముందు సీజన్స్ ఇలా ఉండేవి కాదు.

టైటిల్ విన్నర్ ఎవరో అందరికి అర్థం అయిపోయేది..ఈ సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ రేవంత్ అని అందరికి తెలుసు..కానీ చివరి వరుకు నమ్మలేం..ఎందుకంటే ఈ సీజన్ అలాంటి ఉదాహరణలకు నిలయం గా నిలిచింది..ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం ఎవరు టైటిల్ ని ని గెలవబోతున్నారు..మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ ఫినాలే వీక్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ గా నిలిచారు రేవంత్ మరియు శ్రీహాన్..రేవంత్ మొదటి స్థానం లో కొనసాగుతుండగా..శ్రీహాన్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు..గత రెండు వారాల నుండి శ్రీహాన్ నామినేషన్స్ లోకి రాలేదు..అందువల్ల అతని ఓటింగ్ పై ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు..కానీ పడలేదు..ఇంతకు ముందు తో పోలిస్తే బెటర్ ఓటింగ్ తో టాప్ 2 లోకి వచ్చాడు..కానీ సీజన్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనే విధంగా ఉంది కాబట్టి శ్రీహాన్ కూడా టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు.

ఇక బుధవారం రోజు ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఇదివరకే అధికారికంగా ప్రకటించారు..ఈ ఎలిమినేషన్ లో ఆది రెడ్డి మరియు శ్రీ సత్య బయటకి వెళ్ళిపొయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..ఆది రెడ్డి ఓటింగ్ ప్రకారం అయితే టాప్ 3 స్థానం లో ఉన్నాడు..కానీ ఆయన కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్..ఏమి జరుగుతుందో తెలియాలంటే రేపటి వరుకు ఆగాల్సిందే.