https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Winner Revanth : బిగ్ బాస్ గెలిచి రేవంత్ మునిగాడు.. ఓడి శ్రీహాన్ నిలిచాడు.. ఇదే ఈసారి ట్విస్ట్

Bigg Boss 6 Telugu Winner Revanth : బిగ్ బాస్ ఫైనల్ ఈసారి ఎవరి అంచనాలకు అందకుండా సాగింది. అందరూ ఊహించినట్టే సింగర్ రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. కానీ ఆ విన్నర్ ప్రైజ్ మనీ పొందడంలో ఓడిపోయాడు. ఇక రన్నరప్ అయిన శ్రీహాన్ బిగ్ బాస్ విజేతగా ఓడిపోయాడు. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా విన్నర్ తో సమానంగా డబ్బు సంపాదించాడు. అదే ఈసారి భారీ ట్విస్ట్. విజేత రేవంత్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 10:46 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Winner Revanth : బిగ్ బాస్ ఫైనల్ ఈసారి ఎవరి అంచనాలకు అందకుండా సాగింది. అందరూ ఊహించినట్టే సింగర్ రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. కానీ ఆ విన్నర్ ప్రైజ్ మనీ పొందడంలో ఓడిపోయాడు. ఇక రన్నరప్ అయిన శ్రీహాన్ బిగ్ బాస్ విజేతగా ఓడిపోయాడు. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా విన్నర్ తో సమానంగా డబ్బు సంపాదించాడు. అదే ఈసారి భారీ ట్విస్ట్. విజేత రేవంత్ కు 50 లక్షలు దక్కకుండా చేయడంలో ఇటు నాగార్జునతోపాటు అటు వేదికపైనున్న హౌస్ మేట్స్ , శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా పరోక్ష సహకారం అందించారు. శ్రీహాన్ ను టెంప్ట్ చేసేలా చేసి ఆ 40 లక్షల ఆఫర్ ను అందుకునేలా చేశారు. నాగార్జున ఆడిన గేమ్ లో పాపం రేవంత్ రెడ్డి వెర్రి పుష్పంగా మారిపోయాడు. అందుకే బిగ్ బాస్ విజేతగా నిలిచినా కూడా రేవంత్ మొఖంలో పెద్దగా ఆనందం లేదు. కేవలం కప్ తప్ప చిప్ప చేతికి వచ్చిన వైనంగా రేవంత్ పరిస్థితి మారింది.

    బిగ్ బాస్ గేమ్స్ లో 50 లక్షల కోసం ఆడుతూ రేవంత్ పడిచచ్చేవాడు. ఇక బిగ్ బాస్ 50లక్షల లోంచి డబ్బులు కట్ చేస్తుంటే రేవంత్ తెగ బాధపడిపోయేవాడు. మీరు ఆడకుండా మన 50 లక్షలు పోతున్నాయని కంటెస్టెంట్లు కీర్తి సహా శ్రీసత్యపై మండిపడ్డాడు. కానీ ఇప్పుడు రేవంత్ ఎంత బాగా ఆడినా అతడికి విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు దక్కకుండా అయిపోయింది.

    నిజానికి టాప్ 2గా నిలిచిన ఇద్దరికీ ప్రైజ్ మనీలో 25 లక్షలు ఆఫర్ ఇవ్వడం వరకూ ఓకే. కానీ అది శృతిమించేసి ఏకంగా 30 లక్షలు, చివరకు 40 లక్షలు చేశారు. అంటే విన్నర్ కు కేవలం కప్ తోపాటు 10 లక్షలు మాత్రమే దక్కుతాయి. ఇదేం న్యాయం అని అందరూ ప్రశ్నిస్తున్నారు.

    నాగార్జున హౌస్ లోకి వెళ్లి కావాలనే ఇలా బిగ్ బాస్ ప్రైజ్ మనీని రన్నర్ శ్రీహాన్ కు మేలు చేసేలా చేశాడని.. బిగ్ బాస్ టీం కూడా దీనికి సహకరించారని.. విన్నర్ ఎవరో ముందే తెలిసిన బయట ఉన్న కంటెస్టెంట్స్ హింట్స్ ఇవ్వడంతో శ్రీహాన్ ఆ 40 లక్షల సూట్ కేసు తీసుకోగలిగాడు. అప్పటివరకూ కప్ ముఖ్యం అని.. డబ్బులకు టెంప్ట్ కానీ శ్రీహాన్ ను నాగార్జున, హౌస్ మేట్స్.. అతడి తల్లిదండ్రులే ప్రోత్సహించి మరీ మంచి నిర్ణయం తీసుకునేలా చేయడం విశేషం.

    మొత్తంగా బిగ్ బాస్ విజేతకే గంపగుత్తగా 80 లక్షల దాకా ప్రయోజనం కల్పించడం కరెక్ట్ కాదని.. మిగిలిన ఇద్దరికీ సమంగా నాగార్జున, బిగ్ బాస్ టీం కలిసి పంచినట్టు కనిపిస్తోంది. సూట్ కేసు ఆఫర్ 40 లక్షలు తీసుకొని శ్రీహాన్ బాగా లాభపడ్డాడు. కప్ తోపాటు 10 లక్షలు, ఫ్లాట్, కారుతో అంతే మొత్తంతో రేవంత్ సర్దుకున్నాడు. గెలిచాన ఆ ఆనందం రేవంత్ కు చేయడంలో నాగార్జున, బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి