Bigg Boss 6 Telugu- Sri Satya: ఈ సీజన్లో భారీ నెగిటివిటీ ఎదుర్కొంటుంది కంటెస్టెంట్ శ్రీసత్య. పెద్ద మానిప్యులేటర్ గా పేరు తెచ్చుకున్న శ్రీసత్య ఇతరులను వాడేసి తాను గేమ్ లో ముందుకు వెళుతున్నారనే వాదన ఉంది. కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఉన్నంత వరకూ అతడిని వాడుకుంది. అర్జున్ ఎలిమినేషన్ కి కారణమైంది. అర్జున్ వెళ్లిపోయాక శ్రీహాన్ కి దగ్గరైంది. ఇప్పుడు శ్రీహాన్, రేవంత్ లను మెత్తగా నొక్కుతుంది అంటున్నారు. ముఖ్యంగా శ్రీహాన్ కి బాగా దగ్గరైంది. నాలుగైదు వారాలుగా శ్రీసత్యతో స్నేహం చేస్తూ శ్రీహాన్ కూడా నెగిటివిటీకి గురవుతున్నాడు.

శ్రీసత్యకు దగ్గరైనప్పటి నుండి శ్రీహాన్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ప్రేక్షకులు అతడిని తిట్టిపోస్తున్నారు. వెటకారం, యాటిట్యూడ్ ఎక్కువైంది అంటున్నారు. ముందు శ్రీహాన్, శ్రీసత్యలలో ఒకరిని ఎత్తేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీసత్యను దారుణ ట్రోలింగ్ కి గురవుతుంది. ఆమె పెద్ద అసత్య, స్నేక్ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది. గత వారమే శ్రీసత్య ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఫ్యామిలీ వీక్ కోసం అపారనే వాదన ఉంది. ఆ కారణంతో మదర్ ఇండియా మెరీనాను బలి చేశారని సమాచారం.
ఈ వారం సత్య ఎలిమినేట్ అయితే ఇంటికి పంపాలని ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రేక్షకులు కోరుకుంటున్నట్లే శ్రీసత్య ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లిస్ట్ లో ఉంది. బిగ్ బాస్ ఈసారి కొత్తగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఇద్దరిని రహస్యంగా నామినేట్ చేసే ఏర్పాటు చేశాడు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి ఫోటోలను ముక్కలు చేసి నామినేట్ చేశారు.

అత్యధికంగా శ్రీహన్ ని నలుగురు నామినేట్ చేశారు. ఇక 12వ వారానికి శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా, ఇనయా, రోహిత్ నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. రేవంత్ కెప్టెన్ కావడంతో నామినేట్ కాలేదు. కీర్తి తక్కువ ఓట్లతో సేవ్ అయ్యింది. ఇక శ్రీసత్యపై కసిగా ఉన్న ఆడియన్స్ ఆమెను ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే ఆడియన్స్ అభిప్రాయంతో పనేముంది, నిర్వాహకుల ఇష్టప్రకారమే ఎలిమినేషన్ ఉంటుందనే వాదన ఉంది. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో.