https://oktelugu.com/

BiggBoss 6 Nominations : బిగ్ బాస్ 6: రచ్చరంబోలా.. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం ఒకటే తక్కువ.. ఈవారం వీళ్లే నామినేట్!

BiggBoss 6 Nominations : బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ వాడి వేడిగా మొదలైంది. పగటిపూట పడుకుంటున్నారని కెప్టెన్ రాజ్ సీరియస్ అయ్యాడు. ఆరోహి, బాలాదిత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ రాజ్ పై ఆరోహి విరుచుకుపడింది. గట్టిగా వాదించింది. ఎప్పుడూ హౌస్ లో కూల్ గా ఉండే బాలాదిత్య సైతం స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక ఆ తర్వాత సోమవారం కావడంతో నామినేషన్లపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. అనుకున్నట్టే.. నాగార్జున భావించినట్టే అగ్రెసివ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2022 / 11:13 PM IST
    Follow us on

    BiggBoss 6 Nominations : బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ వాడి వేడిగా మొదలైంది. పగటిపూట పడుకుంటున్నారని కెప్టెన్ రాజ్ సీరియస్ అయ్యాడు. ఆరోహి, బాలాదిత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ రాజ్ పై ఆరోహి విరుచుకుపడింది. గట్టిగా వాదించింది.

    ఎప్పుడూ హౌస్ లో కూల్ గా ఉండే బాలాదిత్య సైతం స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక ఆ తర్వాత సోమవారం కావడంతో నామినేషన్లపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. అనుకున్నట్టే.. నాగార్జున భావించినట్టే అగ్రెసివ్ గా నామినేషన్ ప్రారంభమైంది. కొట్టుకోవడం తక్కువ అన్నట్టుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాగ్వాదం పెట్టుకున్నారు.

    ఇక బిగ్ బాస్ నామినేషన్ ను శ్రీసత్య ప్రారంభించింది. ఆమె ఆరోహి, ఇనాయాలను నామినేట్ చాలా పెద్ద గొడవ వారితో పెట్టుకుంది. ఆ తర్వాత గీతూ కూడా సుదీపతో ఇలానే పెద్ద గొడవ పెట్టుకుంది. ఇక చంటి తన నామినేషన్ సమయంలో గీతూతో పెద్ద గొడవకు దిగాడు. గీతూతో ఇనాయా గొడవ పెద్దదైంది. వీరిద్దరి మధ్య బూతులు తిట్టుకునేంతగా వాగ్వాదం నడించింది. పోవే, ఆపవే అంటూ ఇద్దరూ భారీగా లొల్లి పెట్టుకున్నారు. నేహా-వాసంతిలు భారీగా వాదులాడుకుంటున్నారు.

    శ్రీసత్య-ఆరోహి, ఇనాయాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత
    గీతూ- నేహా, చంటిలను
    ఇనాయా-గీతూ, రేవంత్ లను..
    ఆదిరెడ్డి – ఇనాయా, వాసంతిలను
    సుదీప-గీతూ, శ్రీహాన్ లను
    బాలాదిత్య- ఆరోహి, రేవంత్ లను..
    వాసంతి-ఆదిరెడ్డి, నేహాలను..
    మెరినీ-రాహిత్- రేవంత్, ఫైమాలను
    ఆర్జే సూర్య- రేవంత్, బాలాదిత్యలను..
    కీర్తి -ఆరోహి, చలాకీ చంటిలను..
    నేహా- వాసంతి, గీతూలను
    అర్జున్- ఆరోహి, శ్రీహాన్ లను
    ఫైమా- మెరినారోహిత్, బాలాదిత్యలను…
    శ్రీహాన్ -ఇనాయా, అర్జున్ లను
    రేవంత్ -సూర్య, నేహాలను..
    ఆరోహి-శ్రీవిద్య, బాలాదిత్యలను…
    రాజ్ -ఆరోహి, బాలాదిత్యలను నామినేట్ చేశారు.

    ఇందులో అత్యధిక ఓట్లు వచ్చినవారిని గుర్తించిన బిగ్ బాస్.. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్ లు.. వాసంతి, ఆదిత్య, చంటి, ఆరోహి, నేహా, ఇనాయా, శ్రీహాన్, రేవంత్ మరియు గీతూలుగా ప్రకించారు.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వచ్చేవారం చూడాలి.

    గత రెండు వారాలుగా చూస్తే చప్పగా సాగిన బిగ్ బాస్.. సోమవారం ఎపిసోడ్ మాత్రం రక్తికట్టింది. వాదులాటలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేష్ ప్రక్రియ రచ్చ రంబోలా అయ్యింది.

    Recommended Videos: