Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ నామినేషన్ మంటలు మంగళవారం అంటుకున్నాయి. తమను కంటెస్టెంట్లు నామినేషన్ చేసిన వైనంపై చలాకీ చంటి, శ్రీసత్య, రేవంత్ రెడ్డిలు తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ బాధపడ్డారు. ఇక రేవంత్ అయితే కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.
ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ కోసం ‘దొంగ పోలీస్’ ఆట ఆడించాడు బిగ్ బాస్. ఇందులో ఇంటి సభ్యలు కొందరిని దొంగలుగా.. మరికొంత మందిని పోలీసులుగా విభజించారు. ఇక గీతూను మల్టీ కంటెస్టెంట్ గా అటు పోలీస్ గా, ఇటు దొంగగా.. వ్యాపారిగా బహుళ పాత్రను ఇచ్చారు. దొంగలు కొట్టేసిన వస్తువులు కొనడం.. పోలీసులకు సహకరించడం ఇలా గలాట గీతు వైఖరికి తగినట్టుగా మంచి పాత్రను ఇచ్చాడు.
పోలీసులు, దొంగాటలో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు.వీర లెవల్ లో ఆడారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఫైట్ చేశారు. నాగార్జున మొన్న గేమ్ సరిగా ఆడడం లేదని అనడంతో ఈ వారం కంటెస్టెంట్లు ప్రాణాలకు తెగించి పోరాడారు.
రేవంత్ , ఇనాయాల మధ్య దొంగ పోలీస్ ఆటలో దాదాపు కొట్టుకునేంత మోపైంది. ఇద్దరూ వాదులాడుకున్నారు. చివరకు కంటెస్టెంట్లు అంతా విడదీసి పక్కకుపోయారు.
ఇక గలాటా గీతూ దొంగల సొమ్ము కొనే వ్యాపారిగా ఆకట్టుకుంది. కొన్ని బొమ్మలను కొట్టేసిన ఆమె తనకు ఫస్ట్ అమ్మే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. అయితే గీతూ ఏదో స్ట్రాటజీ ఫాలో అవుతోందని ఆమెకు అమ్మేందుకు దొంగల బ్యాచ్ లోని సభ్యులు ముందుకు రాలేదు.
అయితే ధైర్యం చేసి వెళ్లిన శ్రీహాన్ తాను దొంగిలించిన బొమ్మలను గీతూకు అమ్మాడు. ఫస్ట్ అమ్మేవారికి 3వేల తోపాటు కొన్ని ఎక్స్ ట్రా బొమ్మలు కూడా ఇచ్చి శ్రీహాన్ తోపాటు ఇంటి సభ్యులను గీతూ ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత రేవంత్, వాసంతిలు అమ్మినా బొమ్మకు రూ.200 చొప్పున తక్కువ రేటు కట్టి వారికి షాకిచ్చింది.
ఇక ఈ దొంగ పోలీస్ ఆటలో పోలీసులు మిగిలిన బొమ్మలన్నీ దాచేసి దొంగలకు షాకిచ్చారు. ఈ గేమ్ ఎలా సాగుతుందన్నది రేపటి ఎపిసోడ్ లో మనకు అర్థం కానుంది.