Srihan- Siri: బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ ఫైనలిస్ట్ గా శ్రీహాన్ ఎంపికైన విషయం తెలిసిందే. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీహాన్ నేరుగా ఫైనల్ కి చేరుకున్నాడు. టైటిల్ ఫెవరేట్స్ లో శ్రీహాన్ కూడా ఒకడు. శ్రీహాన్ కోసం బయట లవర్ సిరి క్యాంపైన్ చేస్తుంది. ఓట్లు వేసి శ్రీహాన్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఒక నెటిజెన్ ఆమెను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీహాన్ మారిపోయాడన్న టాక్ వినిపిస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? అన్నారు.

ఈ ప్రశ్న సిరిని షాక్ కి గురి చేసింది. ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు వచ్చారు. శ్రీహాన్, కీర్తి కోసం మాత్రం బయట వ్యక్తులు వచ్చారు. కీర్తికి పేరెంట్స్ లేని కారణంగా మనసిచ్చి చూడు సీరియల్ నటుడు మహేష్ కాళిదాసు హౌస్లోకి వచ్చాడు. ఆ సీరియల్ లో కీర్తి, మహేష్ మెయిన్ రోల్స్ చేశారు. కాగా శ్రీహాన్ కి పేరెంట్స్ ఉన్నప్పటికీ సిరి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
శ్రీహాన్ కంటెస్టెంట్ శ్రీసత్యతో సన్నిహితంగా ఉంటున్నారు. స్నేహితులమని చెప్పుకుంటూ ఒకే దుప్పట్లో దూరుతున్న వీరి బాగోతం జనాలు చూస్తున్నారు. సిరి బిగ్ బాస్ హౌస్ కి రావడానికి మెయిన్ రీజన్ ఇదే అనే పుకారు ఉంది. ఇక నవ్వుతూనే సిరి శ్రీసత్యకు చురకలు వేయడం కూడా మనం చూశాం. శ్రీహాన్ ని నేను ఏడిపిస్తా… బాధపడకు అని శ్రీసత్య అనగా… బాధపడతాను ఏడిపించకు అంటూ వెంటనే కౌంటర్ వేసింది. అలాగే శ్రీసత్య విషయంలో శ్రీహాన్ కి గట్టి క్లాస్ పీకిందని టాక్.

ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీహాన్ మారిపోయాడన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. హోస్ట్ నాగార్జున శ్రీసత్యను డైరెక్ట్ గా అడిగాడు. ఈ ప్రశ్నకు తాజాగా సిరి సమాధానం చెప్పారు. శ్రీహాన్ ఒక్కడే కాదు ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ గేమ్ మార్చుకున్నారు. మార్పు మంచిదే కదా. గత సీజన్లో చెప్పినా మారలేదని నన్ను తిట్టారు. ఇప్పుడేమో శ్రీహాన్ మారాడని తిడుతున్నారు… అని అసహనాన్ని తెలియజేసే సింబల్ జోడించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో ఫైవ్ లో పాల్గొన్న సిరి ఫ్రెండ్షిప్ పేరుతో షణ్ముఖ్ తో రొమాన్స్ చేసింది. ఈ సీజన్లో ఆమె లవర్ శ్రీహాన్ శ్రీసత్యతో అదే చేస్తున్నాడు. సిరి హౌస్లోకి వచ్చి వెళ్లినప్పటి నుండి శ్రీహాన్ శ్రీసత్యకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.