Srihan- Inaya Sultana: ఈ వారం బిగ్ బాస్ హౌస్ చాలా హీట్ వాతావరణంలో ప్రారంభమైంది.. నిన్న జరిగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరి మీద ఒకరు ఎలా అరుచుకున్నారో అందరం చూసాం.. ముఖ్యంగా ఆది రెడ్డి , ఫైమా అయితే రేవంత్ ని నామినేట్ చేస్తూ చాలా గట్టిగా అరుచుకుంటారు.. ఇక ఈరోజు బిగ్ బాస్ ‘టికెట్ 2 గ్రాండ్ ఫినాలే’ టాస్కుని నిర్వహించగా హౌస్ మేట్స్ అందరూ హోరాహోరీగా తలపడుతారు.

ఈ టాస్కులో ఒక ప్రతి కంటెస్టెంట్ స్టోర్ రూమ్ లో ఉన్న మంచు మనిషి భాగాలను సమకూర్చుకొని సరైన ఆకారం లో మంచు మనిషి బొమ్మని నిర్మించాలి.. ఈ టాస్కు ప్రారంభం కాస్త వేడిమీదనే సాగినా ఆ తర్వాత చాలా ఫన్నీ గా సాగింది..లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో లో శ్రీహాన్ -ఇనాయ మధ్య ఏదో జరుగుతున్నట్టు కట్ చేసారు..ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచింది.
టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకొని మంచు మనిషి అవయవాలను దొంగలించాలి.. ఈ టాస్కులో ఇనాయ శ్రీహాన్ మీద అటాక్ కి వస్తుంది.. శ్రీహాన్ తల్చుకుంటే ఇనాయని ఒకే ఒక్క కుదుపుతో పక్కకి నెట్టేసే అవకాశం ఉంది..కానీ అలా చెయ్యకుండా ఇనాయ అడ్డుకుంటున్నట్టు నటిస్తూ కాసేపు డ్యూయెట్ లాగా చూసే ప్రేక్షకులకు అనిపించేలా చేస్తాడు.. అప్పుడు శ్రీ సత్య అది చూసి మీ ఇద్దరు అసలు ఏమి చేసుకుంటున్నారు.. అని ప్రశ్నిస్తే.. అటాక్ చేశాను అంటాడు శ్రీహాన్. అది అటాక్ లాగా లేదు..వెళ్లి టెలికాస్ట్ లో చూసుకోండి ఎలా ఉందో..అని చెప్తుంది శ్రీసత్య.. మీకు అలా అనిపిస్తే నేను ఏమి చెయ్యలేను అంటాడు శ్రీహాన్..

ఇక ఆ తర్వాత కూర్చొని ఉన్న ఇనాయ తలని శ్రీహాన్ తాకగానే బిగ్ బాస్ మగధీర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాడు..అప్పుడు శ్రీహాన్ సరదాగా ఇనాయ తో మాట్లాడుతూ ‘నువ్వు మిత్రవిందా..శ్రీ సత్యతో ఐటెం సాంగ్ వేయిద్దాం’ అంటూ కామెడీ చేస్తాడు..ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ప్రోమోని మీరు కూడా కింద చూడవచ్చు.