Bigg Boss 6 Telugu- Srihan vs Revanth: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా బాగా పాపులర్ అయినా కంటెస్టెంట్స్ శ్రీహాన్ , శ్రీసత్య మరియు రేవంత్..వీళ్ళ ముగ్గురు సీజన్ ప్రారంభం నుండి ఒక ప్రణాళిక తో గ్రూప్ గా ఆడుతూ వస్తున్నారు..నామినేషన్స్ కూడా వీళ్ళ ముగ్గురు ఒకరి పై ఒకరు వేసుకోవడం చాలా తక్కువ..మొదటి వారం శ్రీ సత్య పై రేవంత్ నామినేషన్ వేసాడు..ఆ తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళు ఒకరిపై ఒకరు నామినేషన్స్ వేసుకోలేదు.

కానీ గొడవలు అయితే చాలా సార్లు పడ్డారు..ఎంత గొడవ పడినా మళ్ళీ వీళ్ళు వెంటనే కలిసిపొయేవాళ్ళు.. చూడడానికి వీళ్ళ ఫ్రెండ్ షిప్ చాలా ముచ్చటగా ఉంటుంది.. అయితే నిన్న శ్రీహాన్ రేవంత్ పై మరోసారి విరుచుకుపడ్డాడు.. ఎందుకంటే శ్రీ సత్య -శ్రీహాన్ మధ్య ఎదో ఉన్నట్టు రేవంత్ ఒకసారి సరదాగా కామెంట్ చేస్తాడు..మొన్న వీకెండ్ లో నాగార్జున ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో మీకు నచ్చని క్వాలిటీస్ ఏమిటి అని అడిగితే రేవంత్ విషయం లో ఇదే విషయం పై శ్రీహన్ మాట్లాడుతాడు.
‘రేవంత్ కి నోటి దూల కాస్త ఎక్కువ ఉంది.. ఠక్కుమని ఒకమాట విసురుతాడు..దానివల్ల బయట జనాలకు వేరే విధంగా ప్రాజెక్ట్ అవుతుంది’ అని ఒకప్పుడు రేవంత్ శ్రీ సత్య తో తనకి ఉన్న రిలేషన్ పై కామెంట్ చేయడాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తాడు..దీని గురించి రేవంత్ ఆ తర్వాత శ్రీహాన్ తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మధ్య కాసేపు సీరియస్ చర్చ జరిగింది..’నీ నోటి దూల వల్లే బయట జనాలకు పూర్తిగా మా రిలేషన్ గురించి తప్పుగా వెళ్ళింది..నేను కూడా నీకు ఎన్నో చెప్పొచ్చు..నేను చెప్పేవి మీ ఇంట్లో చూస్తే మీ ఆవిడతో గొడవలు అవుతాయి’ అంటూ రేవంత్ కి చెప్తాడు శ్రీహాన్.

‘మీ మధ్య మంచి స్నేహం ఉన్నప్పుడు బయట జనాలకు నేను ఎంత సరదాగా కామెంట్ చేసినా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారు..ఎందుకు దానినే హైలైట్ చేస్తున్నావ్’ అంటూ శ్రీహాన్ అని అంటాడు రేవంత్..అలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వాడివేడిగా చర్చలు జరిగాయి