https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Rohit : ఓటింగ్ లో రేవంత్ ని దాటేసిన రోహిత్..ట్విస్ట్ మాములుగా లేదుగా

Bigg Boss 6 Telugu Rohit : బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం నుండి నేటి వరకు ఇంటి సభ్యులందరినీ డామినేట్ చేస్తూ ముందుకి దూసుకొచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే కళ్ళు మూసుకొని అది రేవంత్ అనే చెప్పొచ్చు..అతని అగ్రెసివ్ ప్రవర్తన ఎవరికీ నచ్చదు కానీ, ఫిజికల్ టాస్కులు ఆడడంలో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ హౌస్ లో రేవంత్ తర్వాతే ఎవరైనా..కానీ రీసెంట్ టైమ్స్ లో రోహిత్ దూసుకొచ్చేసాడు.. ఇతని పై ప్రేక్షకుల్లో చాలా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2022 / 09:01 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Rohit : బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం నుండి నేటి వరకు ఇంటి సభ్యులందరినీ డామినేట్ చేస్తూ ముందుకి దూసుకొచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే కళ్ళు మూసుకొని అది రేవంత్ అనే చెప్పొచ్చు..అతని అగ్రెసివ్ ప్రవర్తన ఎవరికీ నచ్చదు కానీ, ఫిజికల్ టాస్కులు ఆడడంలో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ హౌస్ లో రేవంత్ తర్వాతే ఎవరైనా..కానీ రీసెంట్ టైమ్స్ లో రోహిత్ దూసుకొచ్చేసాడు.. ఇతని పై ప్రేక్షకుల్లో చాలా సానుభూతి ఉంది..చాలా కూల్ యాటిట్యూడ్ తో ఫెయిర్ గా గేమ్ ఆడి గెలవాలనుకునే తత్త్వం గలవాడు రోహిత్.

    ఈ తత్వమే అతని పై ప్రేక్షకుల్లో సానుభూతి పెంచేలా చేసింది..ఇక మెరీనా ఎలిమినేట్ అవ్వడం రోహిత్ కి ఇంకా బాగా కలిసొచ్చింది..ఇదే ఇతనిని టైటిల్ గెలిపించే అంశాలుగా మారబోతున్నాయి అంటే అవుననే చెప్పాలి.. ఎందుకంటే రీసెంట్ ఓటింగ్స్ లో అతని గ్రాఫ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి ఎదిగిపోయింది.. బిగ్ బాస్ నిర్వాహకులు సైతం సడన్ గా పెరిగిన అతని ఓటింగ్ గ్రాఫ్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

    గత వారం జరిగిన పోలింగ్ లో రోహిత్ టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచినట్టు తెలుస్తోంది.. గత వారంలో జరిగిన చివరి కెప్టెన్సీ పోటీ లో ఇనాయ కావాలని ఉద్దేశపూర్వకంగా రోహిత్ ని వెన్నుపోటు పొడిచి అతనికి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యే అవకాశాన్ని కోల్పోయేలా చెయ్యడంతో రోహిత్ పై ప్రేక్షకుల్లో సానుభూతి బాగా పెరిగింది.. అందుకే ఆ స్థాయి ఓటింగ్ వచ్చిందని టాక్..అంతే కాకుండా ప్రారంభంలో రోహిత్ ఆడిన ఆటకి..ఇప్పుడు రోహిత్ ఆడుతున్న ఆటకి చాలా తేడా ఉంది..గొప్పగా తన ఆటని ఇంప్రూవ్ చేసుకున్నాడు..అందుకే అతని గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

    ఇక ఈ వారం నామినేషన్స్ లో రోహిత్ తో పాటుగా రేవంత్ కూడా ఉన్నాడు.. ఈ నామినేషన్స్ లో ప్రస్తుతం రోహిత్ రేవంత్ ని దాటేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.. ఇలా ఇది వరకు ఎప్పుడూ ఈ సీజన్ లో జరగలేదు..మరి ఇదే రేంజ్ గ్రాఫ్ ని మైంటైన్ చేస్తూ రోహిత్ టైటిల్ గెలుచుకుంటాడా..లేదా అనేది చూడాలి.