https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Nagarjuna Faima : పబ్లిక్ లో నాగార్జున చిలిపి పనులు… మీరు అలా చేయకండి నిద్రపట్టడం లేదని వేడుకున్న ఫైమా!

Bigg Boss 6 Telugu Nagarjuna Faima :  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేదికపైకి వచ్చిన ఫైమా చేతిని నాగార్జున ముద్దాడబోయాడు. ఫైమా వద్దు సార్ నాకు నిద్ర పట్టడం లేదంటూ… ఇంకా రొమాంటిక్ ఆన్సర్ చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైమా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన ఫైమా అందరి థింకింగ్ మార్చేసింది. ఆమెలో అంత […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 08:32 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Nagarjuna Faima :  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేదికపైకి వచ్చిన ఫైమా చేతిని నాగార్జున ముద్దాడబోయాడు. ఫైమా వద్దు సార్ నాకు నిద్ర పట్టడం లేదంటూ… ఇంకా రొమాంటిక్ ఆన్సర్ చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైమా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన ఫైమా అందరి థింకింగ్ మార్చేసింది. ఆమెలో అంత పోరాట పటిమ, విషయాలను విశ్లేషించగల టాలెంట్ ఉంటుందని ఊహించలేదు. ఫైమా నాలుగు వారాలు ఉంటే ఎక్కువని అనుకున్నారు. కానీ ఆమె 13 వారాలు హౌస్లో ఉంది.

    తనతో పాటు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన చలాకీ చంటి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆయన నాకు గేమ్ రావడం లేదని నేరుగా ఒప్పుకున్నాడు. సరిగా పెర్ఫార్మర్ చేయలేకపోతున్నానని వైఫల్యం అంగీకరించిన చంటి 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా ఒక ప్రక్క ఎంటర్టైన్ చేస్తూనే, టాస్క్స్ లో గట్టిగా పోరాడింది. ఫైమా కెప్టెన్ కూడా అయ్యింది. అలాగే ఆమె రేవంత్, శ్రీహాన్ లతో ఫిజికల్ టాస్క్ లో పోటీపడి ఎవిక్షన్ పాస్ గెలుపొందింది.

    అయితే వెటకారం అనేది ఆమెకు మైనస్ గా మారింది. అదే సమయంలో మెరీనాను ఫైమా ఒక సందర్భంలో కించపరిచేలా మాట్లాడారు. ఇవి ఫైమా గేమ్ లో లోపాలని చెప్పొచ్చు. 13వ వారం ఫైమా ఎలిమినేటై బయటకు వచ్చేశారు. ఎలిమినేషన్ డే నాడు ఫైమా చేతిపై నాగార్జున కిస్ పెట్టాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో నాగార్జున మరోసారి ఫైమాను ముద్దాడే ప్రయత్నం చేశాడు. హౌస్లో ఉన్న ఆదిరెడ్డి… బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఫైమా అన్నాడు. ఆదిరెడ్డి కోరిక మేరకు ఫైమాకు బెస్ట్ డాన్సర్ అవార్డు ఇవ్వడం జరిగింది.

    ఆ అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వెళ్లిన ఫైమా చేతిని నాగార్జున కిస్ చేయబోతే… ఫైమా వెనక్కి లాగేసుకుంది. మీరు అలా చేయకండి సార్, నాకు నిద్ర రావడం లేదంటూ సూపర్ రొమాంటిక్ డైలాగ్ కొట్టింది. నాగ్-ఫైమా మధ్య ఫైనల్ లో చోటు చేసుకున్న ఈ సీన్ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. కాగా ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ గెస్ట్స్ గా రవితేజ, నిఖిల్ వచ్చారు. రవితేజ హౌస్లోకి వెళ్లి సూట్ కేస్ ఆఫర్ చేయగా… నిఖిల్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో పాల్గొన్నారు.