Rajinikanth Latha : సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతకు విడాకులు ఇవ్వాలనుకున్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టాక వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రజినీకాంత్ స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభిమాని అయిన లతను రజినీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న లత కాలేజ్ మ్యాగజైన్ కోసం రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నారు. పైరవీలు చేసి అతికష్టం మీద ఆయన అపాయింట్మెంట్ సాధించింది. ఇంటర్వ్యూ చేస్తున్న లత అందానికి,మాట తీరుకు రజినీకాంత్ ముగ్దుడైపోయాడు. వెంటనే పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఏం చెప్పాలో తెలియక పెద్దవాళ్లను అడిగి నిర్ణయం చెబుతానని లత సమాధానం చెప్పారు.

లత సమాధానం కోసం రజినీకాంత్ ఎంతగానో ఎదురు చూశారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లి ముహూర్తం పెట్టారు. 1981లో తిరుపతిలో రజినీకాంత్ వివాహం జరిగింది. 1982 లో పెద్ద అమ్మాయి ఐశ్వర్య రజినీకాంత్, 1984లో రెండో అమ్మాయి సౌందర్య రజినీకాంత్ పుట్టారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. రజినీకి భక్తి ఎక్కువ. ఆ సమయంలో హరే కృష్ణ మూమెంట్ ముమ్మరంగా జరుగుతుంది. అందులో పాల్గొంటూ రజినీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు.
అది లతా-రజినీ మధ్య గొడవలకు దారి తీసింది. అప్పట్లో పత్రికలు భార్యతో రజినీకి విబేధాలు, విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. రజినీకాంత్ ఈ విషయంపై స్పందించారు. అభిప్రాయబేధాల వలన నాకు లతతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అందుకే విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అంతకు మించి మా మధ్య ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్-లత విడిపోవడం ఖాయమని కొందరు భావించారు. పత్రికల్లో ఇదే విషయం ప్రచురించారు. అయితే ఆయనకు రెండో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని పత్రికల్లో రాశారు.

1985లో ఈ వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో రజినీకాంత్ శ్రీ రాఘవేంద్ర టైటిల్ తో భక్తిరస చిత్రం చేస్తున్నారు. భార్యకు ఆయన దూరంగా ఉండటానికి ఇది కూడా కారణం కావచ్చు. కాగా రజినీకాంత్-లత తిరిగి కలిసిపోయారు. మనస్పర్థలు తొలగి పోయాయి. అక్కడ నుండి దశాబ్దాలుగా వారి దాంపత్య జీవితం సాగుతుంది. ఇటీవల ధనుష్ తో రజినీ కూతురు ఐశ్వర్య విడాకులు ప్రకటించారు. వీరిద్దరూ మరలా కలిసిపోయినట్లు సమాచారం.
https://twitter.com/ravindraraj11/status/1593418656251543552?s=20&t=fwtcBs92kxUx2d8z-FJdsg