Bigg Boss 6 Telugu Day 5 Episode Review: బిగ్ బాస్ 5వ రోజు కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఇంటి సభ్యులంతా నీటిలో ముంచిన తాళాల గుత్తిలను వెలికి తీసి తాళాలు తీయాలని సూచించారు. ఈ సందర్భంగా ఫైమాను సంచాలకురాలిగా నియమించారు. ఫైమా జడ్జిగా రెచ్చిపోయింది. నేహా సరిగా ఆడడం లేదని.. తాళం చెవిల గుత్తి సరిగా ఓపెన్ చేయలేదని ఆమెతో పెద్ద గొడవకు దిగింది. ఫైమాకు, నేహాకు మధ్య ఫైట్ గేమ్ ఆసాంతం కొనసాగింది. వీరి ఫైటింగ్ వెగటు పుట్టేలా తయారైంది. ప్రేక్షకులు, కంటెస్టెంట్లు కూడా ఆపండ్రా బాబూ అంటూ మొత్తుకున్న పరిస్థితి నెలకొంది.

టాస్క్ పూర్తయ్యాక నేహా గుక్కపట్టి ఏడ్చింది. సంచాలకురాలు ఫైమా అరుపులకు హర్ట్ అయిన నేహా ఇలా ఏడ్చేసింది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో గీతూ, నేహా టీంలు ముందుగా పూర్తి చేసినా కూడా వాళ్లు సరిగా చేయలేదని నిర్ధారించిన ఫైమా ‘బాలాదిత్య’ బాగా నీట్ గా టాస్క్ పూర్తి చేశారని ఆయననే కెప్టెన్సీ రేసులో గెలిచినట్టు ఫైమా డిక్లేర్ చేసింది.దీంతో బిగ్ బాస్ 6 సీజన్ తొలి కెప్టెన్ గా ‘బాలాదిత్య’ ఎన్నికయ్యారు. ఆయనను సింహాసనంపై కూర్చోబెట్టి కెప్టెన్ గా ఇంటి సభ్యులు సన్మానించారు.
ఇక తొలి వారంలో ‘వరెస్ట్’ పర్ ఫామెర్ ఎవరు అని బిగ్ బాస్ ఇంటిసభ్యులకు మరో పరీక్ష పెట్టారు. అందులో మెజార్టీ సభ్యులు ఇంట్లో మాటలతో రెచ్చిపోయిన లేడీ పుష్ప ‘గీతూ’ చెత్త కంటెస్టెంట్ అంటూ ఆమె నుదిటిపై ఎర్రటి స్టాంప్ వేశారు. అయితే ఇవన్నీ సప్పని విషయాలని.. ఇందుకు తనను నామినేట్ చేయడం ఏంటని ఆమె వాపోయింది.
చెత్త కంటెస్టెంట్ కోసం మెజార్టీ సభ్యులు గీతూనే టార్గెట్ చేశారు. ఆమె ప్రవర్తన బాగాలేదని కారణాల మీద కారణాలు చెప్పారు. బాలాదిత్యపై కాళ్లు వేసి అనుచితంగా ప్రవర్తించడం.. ఇతరులు మాట్లాడితే వినకుండా సొల్లు చెబుతున్నారని ఎద్దేవా చేయడం.. ఇలాంటివెన్నో గీతూ ప్రవర్తనపై ఇంటిసభ్యులు తప్పుపట్టారు. వేలెత్తి చూపారు. ఆమెనే చెత్త పర్ ఫామర్ అని ఆమె ముఖంపై ఎర్రటి స్టాంప్ వేశారు.
ఇక ఇనాయా దురుసుగా ప్రవర్తించింది. కంటెస్టెంట్ బాలాదిత్య , శ్రీహాన్ లతో గొడవకు దిగింది. బాలాదిత్య ఎంత సర్ధి చెప్పినా కూడా ఇనియా ఆగకుండా రెచ్చిపోయింది. శ్రీహాన్ తన ప్రేయసి సిరిని బయటపెట్టి ఇక్కడ పాపులర్ అవుతున్నాడని.. ఆమె ఓట్లు వేయిస్తోందంటూ ఇనాయా కామెంట్ చేసింది. దీనికి శ్రీహాన్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీహాన్ ను సూర్య, ఆరోహిలు ఓదార్చారు.
ఇక వరెస్ట్ పర్ ఫామెన్స్ గా గీతూను ఎంపిక చేసిన ఇంటి సభ్యులు ఆమెను జైలుకు పంపారు. జైల్లో పెట్టి బయట తాళం వేశారు. ఇక తనను అందరూ టార్గెట్ చేయడంపై గీతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫైమాతో చెప్పుకొని బాధపడింది. రేవంత్, సహా కొంతమంది ఇంకా దారుణంగా మాట్లాడినా వారిని ఎంపిక చేయలేదని.. ఆవేదన వ్యక్తం చేసింది.
మొత్తంగా ఐదో రోజు కెప్టెన్సీ టాస్కులో సీనియర్ నటుడు బాలాదిత్య గెలిచి ఇంటి తొలి కెప్టెన్ కాగా… టాస్కుల్లో గొడవలు, వాగ్వాదాలతో రచ్చరచ్చ అయ్యింది. ఇక చివర్లో చెత్త పర్ ఫామర్ గా గీతూను అందరూ ఎంపిక చేసి ఆమె ప్రవర్తన బాలేదంటూ స్టాంపులు వేసి మరీ జైలుకు పంపారు. ఐదోరోజు అంతగా ఏమోషన్స్ తో నిండిపోయింది. ఐదోరోజుకే ఇంతలా హౌస్ గందరగోళంగా మారిందటే ఇక మున్ముందు మరింత దిగజారడం ఖాయమని.. ప్రేక్షకులకు మాత్రం ఎంటర్ టైన్ మెంట్ పంచడం ఖాయమని అంటున్నారు.