Bigg Boss 6 Telugu 8th Week Elimination: బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. టాప్ కంటెస్టెంట్ అనుకున్నవాళ్ళు క్రింద పడిపోవచ్చు. వరస్ట్ కంటెస్టెంట్ అనుకున్నవాళ్లు టాప్ కి లోకి వెళ్లొచ్చు. ప్రతివారం గేమ్ ఆధారంగా కంటెస్టెంట్స్ రేటింగ్, వాళ్లకు ప్రజల్లో ఉన్న ఆదరణ మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ వారం హౌస్ నుండి ఒక టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం అందుతుంది. ఇంటి సభ్యులు కూడా భేష్ అన్న సదరు కంటెస్టెంట్ ఈ వారం హౌస్ వీడటం లాంఛనమే అంటున్నారు.

8వ వారం ఎలిమినేషన్ కి హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అత్యధికంగా మెరీనా, శ్రీసత్యను ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. ఒక ఓటు వచ్చిన వాళ్ళను కూడా బిగ్ బాస్ నామినేట్ చేయడం జరిగింది. ఈ ఆదివారం ఇంటి సభ్యుల్లో ఒకరు బట్టలు సర్దుకొని సొంత ఇంటికి పోనున్నారు. కాగా ఈ వారం ఫెమినిస్ట్ సూర్య ఎలిమినేట్ అవుతున్నాడట. ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు పొందిన సూర్య ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం అందుతుంది.
సూర్య ఎలిమినేషన్ అనూహ్య పరిణామం. ఇంటి సభ్యులే స్వయంగా అతడు స్ట్రాంగ్ ప్లేయర్ అని ఒప్పుకున్నారు. బిగ్ బాస్ టాస్క్స్, గేమ్స్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే సూర్య ఇంటి పనుల్లో కూడా చురుగ్గా ఉంటాడనే టాక్ ఉంది. అతనికి ఉన్న ఒకేఒక బ్యాడ్ నేమ్ అఫైర్స్. ఆరోహిరావు తో సన్నిహితంగా మెలిగిన సూర్య ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనయాకు దగ్గరయ్యాడు. ఇనయా సైతం సూర్య కోసం తన మనసు ద్వారాలు తెరిచింది. సూర్య కంటే క్రష్ అంటూ వెల్లడించింది.

సూర్య ఒకేసారి కెప్టెన్ అయ్యాడు. మరోసారి కెప్టెన్సీ కంటెండర్ గా బరిలో ఉన్నాడు. నేటి ఎపిసోడ్లో ఎవరు కెప్టెన్ అనేది తేలిపోనుంది. మరి ప్రచారం జరుగున్నట్లు సూర్య ఎలిమినేట్ అయితే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఇంటిని వీడినట్లే. ఒక వారం రోజులుగా ఇనయా-సూర్య దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ మాట అనుకోని ఈ పని చేశారు. కాగా గత వారం అర్జున్ కళ్యాణ్ ఇంటిని వీడిన విషయం తెలిసిందే. 7వ ఎలిమినేషన్ గా అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ గమనిస్తే… షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి,సుదీప, అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ కావడమైంది.