Bigg Boss 6 Telugu 11th Week Nominations: బిగ్ బాస్ హౌస్లో టాప్ టెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. 21 మంది సభ్యులతో మొదలైన షోలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ షాక్ ఇచ్చారు. టాప్ సెలబ్రిటీ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ బాల ఆదిత్య అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. శనివారం బాల ఆదిత్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున నేరుగా ప్రకటించారు. ఎలిమినేషన్ పట్ల హుందాగా స్పందించిన బాల ఆదిత్య చిరునవ్వుతో హౌస్ వీడారు. నిన్న ఆదివారం ఉత్కంఠ మధ్య వాసంతి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

ఎలిమినేషన్ ప్రాసెస్ లో అందరూ సేవ్ అయ్యారు. చివరకు వాసంతి, మెరీనా మిగిలారు. మెరీనా ఎలిమినేట్ కానున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయి. వాసంతికి ఉద్వాసన పలికారు. వాసంతి సైతం తన ఎలిమినేషన్ ని ధైర్యంగా అంగీకరించింది. కొంచెం ఎమోషనల్ అయినప్పటికీ నవ్వుతూనే హౌస్ వీడారు. వాసంతి నిష్క్రమణతో హౌస్లో ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా, రాజ్, కీర్తి, మెరీనా, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయా మిగిలారు.
వీరిని టాప్ టెన్ గా నాగార్జున ప్రకటించారు. వీరిలో మరింత ఫైర్ రాజేసేందుకు, టైటిల్ కోసం పోటీపడేందుకు నాగార్జున క్యాష్ ప్రైజ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేశాడు. గెలిచిన కంటెస్టెంట్ రూ. 50 లక్షలు గెలుచుకుంటాడని ఆశ కలిగించారు. కాగా నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఆదిరెడ్డి ఇప్పటి వరకు నామినేట్ చేయని శ్రీహాన్, రోహిత్ లను నామినేట్ చేశాడు. ఫైమా… రోహిత్, ఇనయాలను నామినేట్ చేసింది.

ఇక శ్రీహాన్.. రోహిత్, రేవంత్ లను నామినేట్ చేశాడు. డస్ట్ బిన్ లో ఉన్న చెత్తను నెత్తిపై పోసి నామినేట్ చేశారు. తాజా ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అయితే అధికారిక ఎపిసోడ్ కి ముందే నామినేషన్స్ లీకయ్యాయి. హౌస్లో ఉన్న పది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు సమాచారం. టాప్ టెన్ కి వెళ్లారంటే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి వచ్చే వారం హౌస్ వీడేది ఎవరనే ఆసక్తి నెలకొంది. ఇక టాప్ ఫైవ్ లో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, ఫైమా, కీర్తి ఉండచ్చనే వాదన వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి భవిష్యత్ ని ఊహించలేము. అంచనాలు తారుమారు కావచ్చు.