RRR Story Leaked: బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ కథ లీక్.. హైలెట్స్ ఇవే

RRR Story Leaked:  ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే చిత్రాన్ని చూసేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. బిగ్ మల్టీస్టారర్ అయిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల నడుమ మార్చి 25న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి […]

Written By: NARESH, Updated On : March 24, 2022 4:41 pm
Follow us on

RRR Story Leaked:  ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే చిత్రాన్ని చూసేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. బిగ్ మల్టీస్టారర్ అయిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR Story Leaked

భారీ అంచనాల నడుమ మార్చి 25న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన కథ తాజాగా లీక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ కు కథను అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ స్టోరీ లైన్ ను బయటపెట్టడంతో అది వైరల్ గా మారింది.

Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఎక్కువై.. రాంచరణ్ తక్కువైనా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో నడుస్తున్నాయి. దాదాపు 15 రోజులుగా రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ అదే పనిలో ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు కథను అందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ మాత్రం కనిపించలేదు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే సడెన్ గా విజయేంద్రప్రసాద్ కొన్ని న్యూస్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ మూవీ కథను లీక్ చేశారు. ‘ఈ కథలో రాంచరణ్, తారక్ లు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత మంచి స్నేహితులు. కానీ ఈ కథలో వీళ్లిద్దరి ఐడియాలజీ వేరు. సినిమా మొదట్లోనే ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాలు అన్న విషయం తెలుస్తుంది’ అని అసలు కథను ముందే లీక్ చేశారు.

RRR Story Leaked

ఇక అంతటితో ఆగకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ ను బయటపెట్టారు. హీరోలిద్దరూ వేర్వేరు స్వభావాలు ఉన్న వాళ్లు కావడంతో వీళ్లకు పడదని మనకు అర్థమవుతుందని.. ఇంటర్వెల్ ముందు వీరు ఇద్దరూ సింహాల్లా దెబ్బలాడుతారని.. అది చూస్తే మనకు ఏడుపు వస్తుందని కథను రివీల్ చేశాడు విజయేంద్రప్రసాద్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటీష్ వారిపై కలిసి పోరాటం చేయడమే కథ అని మొత్తం విషయాన్ని ముందే రివీల్ చేశారు.

విజయేంద్రప్రసాద్ చెప్పిన ఈ కథ ఇప్పుడు వైరల్ అయ్యింది. మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఆర్ఆర్ఆర్ కథ లీక్ అంటూ అందరూ దీన్ని షేర్ చేస్తున్నారు. మరి ఈ లీక్ ఆర్ఆర్ఆర్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అన్నది వేచిచూడాలి.

Also Read:  కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ను ఎందుకు బ్యాన్ చేయాలంటున్నారు.. అసలు కారణం ఇదే..

Recommended Video:

Tags