https://oktelugu.com/

Deepthi Case: బిగ్ బ్రేకింగ్: దీప్తి హత్య కేసును చేదించిన పోలీసులు: నిందితురాలు సొంత చెల్లి, ఆమె ప్రియుడు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్ ఇటుక బట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఇతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దకూతురు బంకి దీప్తి బీటెక్ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : September 2, 2023 / 02:25 PM IST

    Deepthi Case

    Follow us on

    Deepthi Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి హత్యకేసుకు సంబంధించి పోలీసులు అసలు విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్లు మిస్టరీగా సాగిన దీప్తి మృతి వెనక అసలు నిజాలను బయటపెట్టారు. దీప్తిని హత్య చేసింది సొంత చెల్లెలు చందన, ఆమె ప్రియుడు అని తేల్చారు. చందన తమ మతం కాని వ్యక్తిని ప్రేమించింది. అయితే వివాహానికి దీప్తి, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. కోపంతో రగిలిపోయిన చందన, తన ప్రియుడితో కలిసి దీప్తిని హతమార్చింది.

    పోలీసులు ఏం చెప్పారంటే

    జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్ ఇటుక బట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఇతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దకూతురు బంకి దీప్తి బీటెక్ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తోంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో శ్రీనివాస్ దంపతులు హైదరాబాదులో ఒక శుభకార్యానికి వెళ్లారు. దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. శ్రీనివాస్ మంగళవారం ఉదయం నుంచి కూతుర్లకు ఫోన్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఇంటి పక్క వారికి శ్రీనివాస్ ఫోన్ చేసి, తన ఇంట్లోకి వెళ్లి చూడమని కోరాడు. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి ముందు రూమ్ లోని సోఫాలో పడి ఉండడాన్ని గమనించారు. వారు ఈ సమాచారాన్ని శ్రీనివాస్ కు అందించారు. పనిలో పనిగా పోలీసులకు కూడా విషయం చెప్పారు.

    రంగంలోకి క్లూస్ టీం

    స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం పోలీసుల క్లూస్ టీం సంఘటన స్థలానికి వచ్చింది. వారు తనిఖీలు నిర్వహించారు. వంట గదిలో ఉన్న మద్యం సీసాను సీజ్ చేశారు. సోఫాలో ఆ చేతనంగా పడి ఉన్న దీప్తిని పరీక్షించగా.. ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం బాటిల్ పై ఉన్న లేబుల్ ఆధారంగా వైన్స్ సిసి పుటేజి పరిశీలించారు. అయితే బుధవారం ఉదయం చందన తన ఫోన్ నుంచి తండ్రి శ్రీనివాస్ కు, తనకు తమ్ముడయ్యే వ్యక్తి సాయికి వాయిస్ మెసేజ్ పెట్టింది.”నేను, అక్క కలిసి పార్టీ చేసుకున్నాం. నేను బ్రీజర్ తాగాను. అక్క హాఫ్ బాటిల్ వోడ్కా తాగింది. ఆ మత్తులో తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలవనా అని నన్ను అడిగింది. దానికి నేను వద్దు అన్నాను. మద్యం ఎక్కువయి సోఫాలో పడుకుంది. నేను రెండుసార్లు లేపినప్పటికీ లేవలేదు. ఛాన్స్ దొరికింది కదా అని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. అంతేగాని అంతేగాని నేను అక్కను ఎందుకు చంపుతాను” అంటూ ఆ ఆడియోలో చందన పేర్కొన్నది. కొద్దిసేపటికి చందన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో పోలీసులకు చందన మీద అనుమానం మొదలైంది. పోలీసులు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫోన్ ట్రేస్ చేశారు. ఆమె హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు. విచారణ బృందం అక్కడి చేరుకోగా.. చందన అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం. చిన్న కూతురు చందన అదృశ్యం కావడం.. శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్ లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సోమవారం ఉదయం ఐదు గంటల 12 నిమిషాల నుంచి ఐదు గంటల 16 నిమిషాల వరకు ఒక యువకుడితో కలిసి నిజామాబాద్ బస్టాండ్ లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్టు సీసీ కెమెరాలు రికార్డు అయింది. చందన తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దీప్తి మరణానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇలా దొరికారు

    దీప్తి మృతి చెందిన తర్వాత చందన ఎక్కడికి వెళ్లింది? ఆమెను అనుసరిస్తున్న యువకుడు ఎవరు? ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఎవరైనా మద్యం తాగారా? ఆ యువకుడితో చందన ఎందుకు పారిపోయింది? దీప్తిని అమే హత్య చేసిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించగా.. దీప్తి, ఆమె ప్రియుడు అసలు విషయాలు వెల్లడించారు. తమ ప్రేమకు దీప్తి అడ్డు చెబుతున్నతీరును తట్టుకోలేని చందన కోపంతో రగిలిపోయింది. తన తల్లిదండ్రులు ఎలాగూ శుభకార్యానికి వెళ్లడంతో సోదరి, తను మాత్రమే ఉన్నారు. ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం తన సోదరితో హాఫ్ బాటిల్ ఓడ్కా తాగించింది. ఆ తర్వాత తాను కూడా బ్రీజర్ తాగింది. దీప్తి మత్తులోకి వెళ్లిపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి మత్తులో ఉన్న దీప్తిని హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, నగదును తీసుకొని చందన, ప్రియుడితో పారిపోయింది. వీరి కదలికలు కోరుట్ల పట్టణంలోని నిజామాబాద్ బస్టాండ్ లో రికార్డ్ అయ్యాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిద్దరూ హైదరాబాదులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్తే కనిపించలేదు. వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత వారు ఫోన్లు ఆన్ చేయడం, సిగ్నల్స్ ట్రాప్ చేయడంతో ఒంగోలులో ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. అక్కడికి వెళ్లి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాలు బయటికి వచ్చాయి.