
Bhoshanam : కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కరివేవుల గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుంటే ఓ భోషాణం బయట పడింది. దీంతో అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయేమోననే ఉత్కంఠతో ఊరంతా గుమిగూడారు. దాన్ని తెరిచేందుకు రెండు రోజులు శ్రమించారు. సుత్తి, కట్టర్ తో దాన్ని పగులగొట్టారు. తీరా చూస్తే అందులో ఏమీ లేదు. అందరికి ఏవో ఆశలు ఉంటాయి. అందులో వజ్రాలు, బంగారం ఉందేమోననే ఆశతో ఊరంతా అక్కడే ఉన్నారు. దాన్ని తెరిచే వరకు ఎవరు కూడా అక్కడ నుంచి కదలలేదు.
గుప్త నిధులపై అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. తమకు గుప్త నిధులు దొరికితే బాగుండు రాత్రికి రాత్రే ధనవంతులం అయిపోవచ్చు అనుకుంటారు. కానీ అదంత సులభం కాదు. అవి ఎక్కడుంటాయో ఎవరికి తెలియదు. కొందరైతే నరబలులు కూడా ఇచ్చిన సంఘటనలున్నాయి. నిధులు దొరుకుతాయో లేదో కానీ వారు మాత్రం జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. అత్యాశ దుఖానికి చేటని తెలిసినా ఆ ప్రయత్నాలు మానరు. అడ్డదారుల్లో అందలాలెక్కాలని అందరు ఆశపడుతుంటారు.
ఇందులో భాగంగానే కరివేవుల గ్రామంలో కనిపించిన భోషాణం గురించి అందరు చర్చించుకున్నారు. కచ్చితంగా అందులో బంగారు నిధులు ఉన్నాయనే ఊహల్లోనే విహరించారు. పురాతన కాలం నాటిది కావడంతో దాన్ని తెరిచేందుకు చాలా శ్రమించారు. తీరా తెరిచాక చూస్తే అందులో ఏముంది పాత కాగితాలు తప్ప ఏమి కనిపించలేదు. ఆ ఇంటి యజమాని వెళ్లిపోయేటప్పుడు దాన్ని అక్కడే వదిలేసి పోవడంతో అది బురదలో కూరుకునిపోయింది. దాన్ని తెరిచిచూస్తే ఏమీ లేదు.
భోషాణం కనిపించగానే ఊరంతా ఒక్క చోట చేరింది. అందులో విలువైన వస్తువులు ఉంటాయోమోనని ఆశగా చూశారు. ఏమి లేకపోయే సరికి నిట్టూర్చుకుని వెళ్లిపోయారు. తామెంతో ఊహించుకున్నామని అనుకుంటున్నారు. ఏవేవో అనుకుంటే ఏదో జరిగినట్లు అందులో బంగారం ఉంటుందని అనుకుంటే వట్టి కాగితాలే దర్శనమిచ్చాయి. మనుషుల ఊహలకు అంతుండదు. ఆలోచనలకు అదుపు ఉండదు. ఏదైనా కనిపిస్తే చాలు దానిపై ఏవేవో అంచనాలు వేసుకుని అక్కడే ఉండటం కామన్ గా మారింది.