Actress : సినీ పరిశ్రమ అంటేనే ఒక రంగుల లోకం. ఎప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయో? ఎప్పుడు ఎవరి కెరియర్ నాశనం అవుతుందో ఎవరికీ తెలియదు. అవకాశాలు ఉన్నన్ని రోజులు మాత్రం సినీ నటులు తారాలోకంలో విహరిస్తారు.. అలాంటి సమయంలో సకల సౌకర్యాలు అనుభవిస్తారు. అదే అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆ తారాలోకం అనేది ఉండదు. సకల సౌకర్యాలు దూరమవుతాయి. అలాంటి వాటి కోసం సినీ నటీమణులు దేనికైనా తెగిస్తారు. అలా తెగించిన ఓనటి చివరికి కటకటాల పాలైంది. సభ్య సమాజం తలదించుకునే పని చేసి నవ్వుల పాలయింది.
ముంబై నగరంలో హై ప్రొఫైల్డ్ సె*** ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు దాడి చేయడంతో పెద్దపెద్ద తలకాయలు బయటకు వచ్చాయి. ఇన్నాళ్లు గొప్ప వాళ్ళుగా చలామణి అవుతున్నవారి అసలి ముఖం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ ముఠాలో బోజ్ పూరి నటి సుమన్ కుమారి కూడా ఉండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ముంబై నగరంలోని గోరెగావ్ లోని రాయల్ పామ్ హోటల్లో కొద్దిరోజులుగా వ్య**** సాగుతోంది. అయితే దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 24 సంవత్సరాలున్న భోజ్ పూరి నటి సుమన్ కుమారి ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై నగరానికి వచ్చి సినీ అవకాశాల కోసం కష్టపడుతున్న వారిని సుమన్ కుమారి ట్రాప్ చేయడం మొదలు పెట్టింది. వారితో వ్య****చేయించడం మొదలుపెట్టింది. కొంతమందిని రెడ్ లైట్ ఏరియా కు పంపించింది.. హై ప్రొఫైల్డ్ కస్టమర్లతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. మొత్తం ఆన్లైన్ విధానం ద్వారా అమ్మాయిలను పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి పంపడం ప్రారంభించింది. అందమైన యువతులకి రకరకాల సౌకర్యాలు అలవాటు చేసి.. తీరా వారిని ఆ రొంపిలోకి దింపింది. ఇలా భారీగా సంపాదించింది. పోలీసుల దాడిలో అడ్డంగా దొరికిపోయింది
సుమన్ కుమారి భోజ్ పురి సినిమా పరిశ్రమలో పేరు పొందిన నటి. ఈమె “లైలా మజ్ను”, బాబ్ నంబ్రీ, బేటా దస్ నంబ్రీ అనే సినిమాల్లో నటించింది. కామెడీ షో లు కూడా చేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ వ్య**** న్ని ఎం చుకుంది.. అయితే సుమన్ కుమారి వాట్సాప్ గ్రూప్ లో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పెద్దపెద్ద వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరినీ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. సుమన్ కుమారి అరెస్టు నేపథ్యంలో అటు భోజ్ పురి, ఇటు బాలీ వుడ్ లో కలకలం చెలరేగింది.
అయితే పోలీసుల విచారణలో సుమన్ కుమారి పలువురు బాలీవుడ్ నటిమణుల పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే హై ప్రొఫైల్డ్ కేసు కావడంతో పోలీసులు చాలా సున్నితంగా విచారణ చేపడుతున్నారు. పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండటంతో బయటికి పొక్కకుండా కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే సినీనటిగా ఉన్నప్పటి కంటే ఈ రొంపి ద్వారానే సుమన్ కుమారి భారీగా ఆస్తులు కూడ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.