https://oktelugu.com/

Bheemla Nayak Theatrical Trailer: షాకింగ్.. ఏంటిది? ‘భీమ్లానాయక్’ మూవీలోని ఈ మూడింటిని గమనించారా?

Bheemla Nayak Theatrical Trailer: ‘పవర్ స్టార్’ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. పవన్ అడుగుపెడితే రికార్డులు బద్దలు అవుతాయని స్పష్టమైంది. సినిమాల గ్యాప్ తో కసిగా రగిలిపోయిన పవన్ కళ్యాణ్ వీరావేశం ‘భీమ్లానాయక్’మూవీ ట్రైలర్ తో ఆవిష్కృతమైంది. ఆ ఊపు, ఆ గ్రేస్ కు రికార్డు వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఒకరిదేమో పోలీస్ పంతం.. ఇంకొకరిది ఆధిపత్యమే ఆసొంతం.. ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో ‘భీమ్లానాయక్ ’ ట్రైలర్ రుచిచూపించింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 8:28 am
    Follow us on

    Bheemla Nayak Theatrical Trailer: ‘పవర్ స్టార్’ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. పవన్ అడుగుపెడితే రికార్డులు బద్దలు అవుతాయని స్పష్టమైంది. సినిమాల గ్యాప్ తో కసిగా రగిలిపోయిన పవన్ కళ్యాణ్ వీరావేశం ‘భీమ్లానాయక్’మూవీ ట్రైలర్ తో ఆవిష్కృతమైంది. ఆ ఊపు, ఆ గ్రేస్ కు రికార్డు వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

    Bheemla Nayak Theatrical Trailer

    Bheemla Nayak Theatrical Trailer

    ఒకరిదేమో పోలీస్ పంతం.. ఇంకొకరిది ఆధిపత్యమే ఆసొంతం.. ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో ‘భీమ్లానాయక్ ’ ట్రైలర్ రుచిచూపించింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అతడిని ధీటుగా ఎదురించే విలన్ గా రానా అంతే ఆవేశపూరితంగా నటించాడు. ఇద్దరు కొదమ సింహాల్లా సాగిన ఈ ట్రైలర్ ఆసాంతం పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉంది.

    #BheemlaNayak Trailer Review | Pawan Kalyan | Rana Daggubati | Trivikram | SaagarKChandra

    పవన్ వీరావేశానికి.. రానా పంతానికి మధ్య సాగిన యుద్ధంగా ఉంది. ఇక భీమ్లానాయక్ తగ్గ భార్యగా నీత్యమీనన్ ఇరగదీసింది. ఒంటిపై యూనిఫాం చూసుకొని చెలరేగిపోయే భర్తకు ఇంకాస్త రెచ్చగొట్టే పవర్ ఫుల్ లేడీగా కనిపించారు.

    Also Read: Bheemla Nayak Theatrical Trailer: 30 నిమిషాల్లో 9,33,580 వ్యూస్.. పవన్ ‘భీమ్లానాయక్’ రికార్డుల బీభత్సం

    ట్రైలర్ చూస్తే ప్రధానంగా మూడు లోపాలు కనిపించాయి. సినిమా ట్రైలర్ ను సరిగ్గా కట్ చేయకపోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ లో పవన్, రానా సీన్లో రానా సీరియస్ లేచి కూర్చీని తంతాడు. ఆ కుర్చీ సౌండ్ వినపడకుండా చివర్లో చప్పుడవుతుంది. దీన్ని బట్టి ట్రైలర్ ను ఆదరబాదరగా ఆగమాగం కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని ఫైట్ ఎలివేషన్ సీన్లలోనూ పర్ ఫెక్షనిజం మిస్ అయ్యింది. లాజిక్ లేకుండా పలు సీన్లు కనిపించాయి. ఈ లోపాలు చూస్తుంటే విడుదలకు రెడీ చేసిన మూవీని తొందరలో ప్రేక్షకుల కోసం ట్రైలర్ ను కట్ చేసి మమ అనిపించినట్టుంది. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిస్ కావడం.. కొన్ని చోట్ల సౌండ్ సీన్ కు, బయటకు వినిపించకపోవడం ప్రధాన మైనస్ గా చెప్పొచ్చు. ట్రైలర్ పూర్తిగా పర్ ఫెక్ట్ గా కట్ చేయలేదని మాత్రం చూసిన కొందరు ఎనలిస్టులు చెబుతున్నారు.

    నాగవంశీ నిర్మాతగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ భీమ్లానాయక్ మూవీని ‘సాగన్ కే చంద్ర’ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈరోజు ప్రీరిలీజ్ లోనే ట్రైలర్ ను లాంచ్ చేయాల్సి ఉన్నా ‘మంత్రి గౌతం రెడ్డి’ మరణంతో వాయిదాపడింది. కానీ ఫ్యాన్స్ కు ఊపు తెచ్చేలా ట్రైలర్ మాత్రం రిలీజ్ అయ్యింది.

    Also Read: Bheemla Nayak Theatrical Trailer Talk : భీమ్లా నాయక్ ట్రైలర్ రివ్యూ: పులి పెగ్గేసుకొని పడుకుంది.. స్లోగా పోనీయ్