Bheemla Nayak First Day Collections in Telugu States
Bheemla Nayak Twitter Review: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ తో వస్తున్న మూవీ ‘భీమ్లానాయక్’. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా ప్రత్యర్థులుగా తలపడుతున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు నటించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ. 109.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 110 కోట్ల బిజినెస్ చేయాలి. 2022లో ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్ చేసిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం.
Bheemla Nayak First Day US Collections!
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి, ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే బీమ్లా నాయక్ అసలు కథ. ఈ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం అభిమానులకి చూపించాడు. ఇక భారీ అంచనాల మధ్య అభిమానుల ముందుకి వచ్చిన బీమ్లానాయక్ .. తోలి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది లో విడుదల అయిన భారీ చిత్రం బీమ్లానాయక్ కావడం మరో విశేషం.
#BheemlaNayak is 🔥🔥! It’s a delight to watch @RanaDaggubati & PK unleashing on screen. Great writing, impactful changes that doesn’t kill the essence of the original, perfect BGM💥👌 @MusicThaman. Samyuktha Menon Shines ✨#BlockBusterBheemLaNayak #BheemlaNayakReview pic.twitter.com/BsnbX8cikd
— Jaiwant Pasupuleti (@JaiPasupuleti) February 25, 2022
ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ నటన చూసి అభిమానులు , సినీ స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. పవన్ తన సహజసిద్ధమైన నటన తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడని ..అసలు తెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తేనే అదొక మ్యాజిక్ అంటూ అభిమానులు చెప్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా పవన్ అలాగే రానా గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. హీరో అయినప్పటికీ నెగటివ్ రోల్స్ లో కూడా రానా నటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడని పవన్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రానా నటించాడని చెప్తున్నారు. అలాగే హీరోయిన్ నిత్యామీనన్ తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.
Early Reports are very promising 🔥 #BheemlaNayak #BheemlaNayakReview pic.twitter.com/Cx0UamSlkw
— Shiva prasaD🕷 (@shivainn) February 25, 2022
మురళీశర్మ , సముద్రఖని మరోసారి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. థమన్ స్వరపరిచిన పాటలు సినిమాకి మరో ప్లస్ అయ్యిందని చెప్పాలి. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం తోలి షో నుండి పూర్తీ పాజిటివ్ మౌత్ టాక్ తో ముందుకి సాగుతూ బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలవడానికి పరుగులు తీస్తుంది.
The flashback episodes untold in full glory. #Thaman makes us root for the mood and the lead character strongly.
Check Out more Live Updates of #BheemlaNayak @ https://t.co/5ptMOq59VH#PawanKalyan #RanaDaggubati #Trivikram #SaagarKchandra #BheemlaNayakReview #IndiaGlitzTelugu pic.twitter.com/ASLvM5Rrtk
— IndiaGlitz Telugu™ (@igtelugu) February 25, 2022
Also Read: Bheemla Nayak Ticket Price in AP: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?
Recommended Video: