Bhanumathi: ఆడది కోసం ఈ నేలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి. అందులో ప్రధానమైనది కురుక్షేత్రం. ఈ రణ రంగానికి ప్రధాన కారణం ఆడది. అహానికి, ఆధిపత్యానికి జరిగిన ఈ పోరాటంలో న్యాయమే గెలిచింది. కానీ మంచి చెడులను సమాజానికి కురుక్షేత్రమే దిక్సూచిగా నిలిచింది. అయితే అందరూ అనుకున్నట్టు పాండవులు, కౌరవులు,ద్రౌపది పాత్రలే కాదు. చరిత్రలో వెలుగులోకి రాని ఘటనలు, ప్రేమ వివాహాలు వంటి ట్విస్టులు సైతం కురుక్షేత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా భానుమతి ప్రేమ కథ హైలెట్ గా నిలుస్తుంది. కొన్ని ప్రసారమాధ్యమాల ద్వారా తెలిసిన వివరాలప్రకారం..
అధికారం కోసం ఎంతకైనా తెగించి తత్వం ఈనాటి రాజకీయ నాయకులదే కాదు. అలనాటి కురుక్షేత్రం నుంచి ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తుల కోసం బంధువులను చంపే క్రూరత్వం వంటివి ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కానీ వేల సంవత్సరాల కిందట కురుక్షేత్రంలో దుర్యోధనుడి రూపంలో ఈ దృశ్యాలన్నీ కనిపిస్తాయి. దుర్యోధనుడు అహం, అహంకారం చుట్టూనే కురుక్షేత్రం తిరుగుతుంటుంది. అసలు ఆ యుద్ధమే వచ్చిందే దుర్యోధనుడి వల్ల. ఓ ఆడది కోసం దుర్యోధనుడి క్రూర ఆలోచనలతో పుట్టిందే కురుక్షేత్రం.అయితే ఈ క్రమంలో దుర్యోధనుడి భార్య భానుమతి గురించి చాలా తక్కువ వివరాలు కనిపిస్తాయి.దుర్యోధనుడికి వివాహం జరిగిందని.. ఆయన స్వయంవరంలో పాల్గొని భానుమతి అనే యువతిని వివాహం ఆడాడని.. స్వయం వరానికి వెళ్లి బలవంతంగా ఆమెను తీసుకొచ్చాడని.. తన స్నేహితుడైన కర్ణుడి సాయంతో ఈ సాహసం చేయడం విశేషం.
పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది. ఆమె వివాహం కోసం తల్లిదండ్రులు స్వయంవరం ఏర్పాటు చేశారు. అర్జునుడితో పాటు దుర్యోధనుడు సైతం స్వయం వరానికి హాజరయ్యారు. కానీ అర్జునుడు చేతిలో దుర్యోధనుడు ఓడిపోతాడు. దుర్యోధనుడు అవమాన భారంతో ఉండగా కళింగరాజు కుమార్తె భానుమతి స్వయంవరం ప్రకటన వచ్చింది. విషయం తెలుసుకున్న అర్జునుడు తన ప్రియమిత్రుడు కర్ణుడితో కలిసి స్వయం వరానికి హాజరయ్యాడు. అప్పటికే వివిధ రాజ్యాల నుంచి యువరాజులు, రాజ్యాధినేతలు భానుమతిని స్వయంవరంలో సొంతం చేసుకునేందుకు వస్తారు. శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులు సైతం అక్కడకు వచ్చారు. భానుమతి అందగత్తె. ద్రౌపతి తో సమతూగే అందం ఆమెది. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అర్జునుడు భావిస్తాడు. కానీ ఆమె కర్ణుడు బలాన్ని, బుద్ధిని చూసి ఇష్టపడుతుంది. స్వయంవరంలో కర్ణుడు మెడలో పూల హారం వేసి భర్తగా స్వీకరించాలని భావించింది. ఆ ఆనందంతోనే చెలికెత్తల తోడుతో సభలోకి ప్రవేశించింది. ఒక్కొక్క రాజకుమారుడు గురించి చెలురు చెబుతుండగా భానుమతి ముందుకు సాగుతోంది. దుర్యోధనుడు దగ్గరికి వచ్చేసరికి.. అతడిని కూడా చూసి చూడనట్లుగా ముందుకు సాగుతోంది. దీంతో దుర్యోధనుడు అవమాన భారంగా భావించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. భానుమతి తిరస్కారాన్ని భరించలేకపోయాడు. వెంటనే భానుమతిని అమాంతం ఎత్తుకొని అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో దుర్యోధనుడిని మిగతా రాజకుమారులు చుట్టుముట్టారు. అయితే తన ప్రాణ స్నేహితుడితో యుద్ధం చేయాలని.. ఆ యుద్ధంలో గెలిచిన వారికి భానుమతిని ఇచ్చి వివాహం చేస్తానని దుర్యోధనుడు చెబుతాడు.ఒక్కో రాజకుమారుడ్ని ఓడిస్తూ కర్ణుడు ముందుకు సాగుతాడు. చివరికి జరాసంధుడితో రోజుల తరబడి యుద్ధం చేస్తాడు. చివరికి తుది ముట్టిస్తాడు. తరువాత భానుమతిని దుర్యోధనుడు హస్తినకు తీసుకెళ్లి వివాహం ఆడతాడు. అప్పటికీ భానుమతి కర్ణుడిని ప్రేమిస్తూ ఉంటుంది. దుర్యోధనుడి బలవంతపు వివాహానికి ఒప్పుకోదు. తప్పు నాయన అని తల్లిదండ్రులు చెబితే తాత భీష్ముడు మాట ఏంటి? అంబా, అంబిక, అంబాలికులను ఇలాగే ఎత్తుకు రాలేదా? అని దుర్యోధనుడు వితండవాదానికి దిగుతాడు. చివరకు వివాహం తంతు పూర్తవుతుంది.
ఒకవేళ దుర్యోధనుడు భానుమతిని వివాహం ఆడకపోయి ఉంటే కర్ణుడితో ప్రేమ బంధం కొనసాగేది. అయితే తనను భానుమతి ప్రేమించిన విషయం తెలియని కర్ణుడు.. వారి వివాహానికి సహాయం అందిస్తాడు. కానీ కర్ణుడిపై ప్రేమను వదులుకోని భానుమతి కొద్దిరోజుల పాటు తన మనసులో కర్ణుడి రూపాన్ని పెట్టుకుంటూ వచ్చింది. అవేవీ తెలియని కర్ణుడు దుర్యోధనుడి స్నేహితుడిగా మాత్రమే కొనసాగారు. ఓసారి భానుమతి పాచికలు ఆడుతోంది. పాచికుల వేసే సమయంలో తప్పు దొర్లుతుంది. అక్కడే ఉన్న కర్ణుడు సరి చేసే ప్రయత్నంలో భానుమతి చేయిని తాకుతాడు. అప్పుడు ఆమె మెడలోని ముత్యాల ఆహారం దిగి పడుతుంది. అప్పుడు కర్ణుడు తాను చేసిన పని అర్థం చేసుకుని బాధపడతాడు. ముత్యాలను ఏరి ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో అక్కడకు దుర్యోధనుడు చేరుకుంటాడు. ఈ హఠాత్ పరిణామంతో కర్ణుడు ఆందోళనకు గురవుతాడు. కానీ కర్ణుడి పై నమ్మకంతో తానే ముత్యాలను ఏరి దుర్యోధనుడు స్నేహితుడికి ఇస్తాడు.వారి మధ్య స్నేహాన్ని చూసి భానుమతి మురిసిపోతుంది. భానుమతి అంటే భర్త దుర్యోధనుడికి ఎంతో ప్రాణం. ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు.
తన వివాహానికి సహకరించిన ప్రాణ మిత్రుడు కర్ణుడు కి ఓ రాజ్యాన్నే దుర్యోధనుడు రాసిస్తాడు. భానుమతి వెంట సహాయం కోసం చెలికత్తిగా ఒక యువతి వస్తుంది. ఆమె రాకను దుర్యోధనుడు తిరస్కరించలేదు. ఆమెను తన స్నేహితుడు కర్ణుడికి ఇచ్చి దుర్యోధనుడు వివాహం చేయిస్తాడు. అయితే కాలక్రమంలో భానుమతి దుర్యోధనుడితో వివాహ జీవితానికి ఒప్పుకుంటుంది. వారికి ఇద్దరు కవలు జన్మిస్తారు. కొడుకు పేరు లక్ష్మణుడు , కూతురు పేరు లక్ష్మణ గా పేరు పెడతారు. మహాభారత యుద్ధంలో లక్ష్మణుడు అభిమన్యుడు చేతిలో హతమవుతాడు. కుమార్తె లక్ష్మణ శ్రీకృష్ణుడు జాంబవతికి జన్మించిన సాంబుడిని వివాహం చేసుకుంటుంది. అయితే వీటి గురించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బలరాముడి కుమార్తె శశిరేఖను.. దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుడికి ఇచ్చి కట్ట పెట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. కానీ అప్పటికే శశిరేఖ, అర్జునుడు కుమారుడు అభిమన్యుడు ప్రేమించుకుంటారు. దీంతో అభిమన్యుడు ఘటోత్కచుడి సాయంతో పెద్దలు తలపెట్టిన పెళ్లిని చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు. తెలుగులో శశిరేఖ పరిణయం గా ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇన్ని ట్విస్ట్ లకు కారణమైన కురుక్షేత్రం నేటి సమాజానికి ఒక దిక్సూచిలా నిలుస్తుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bhanumathi love story in kurukshetra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com