https://oktelugu.com/

Bandla Ganesh: బండ్ల గణేష్ కు ఏమైంది? ఆడియో లీక్.. అన్యాయం చేసింది పవన్ కళ్యాణా?

Bandla Ganesh: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. అస్సలు అర్థం కాకుండా ప్రవర్తిస్తాడు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు.. టాలీవుడ్ లోనే కాదు.. బయట కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంటాడు. తరచూ గొడవల్లో తలదూర్చుతాడు.పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఆయనను దేవుడిగా పూజిస్తాడు. ఇక సామాజిక సమస్యలపై ప్రతీరోజు స్ఫూర్తిదాయకమైన సందేశాలను ట్వీట్ల రూపంలో పంచుకునే బండ్ల గణేష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2022 3:07 pm
    Follow us on

    Bandla Ganesh: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. అస్సలు అర్థం కాకుండా ప్రవర్తిస్తాడు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు.. టాలీవుడ్ లోనే కాదు.. బయట కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంటాడు. తరచూ గొడవల్లో తలదూర్చుతాడు.పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఆయనను దేవుడిగా పూజిస్తాడు.

    ఇక సామాజిక సమస్యలపై ప్రతీరోజు స్ఫూర్తిదాయకమైన సందేశాలను ట్వీట్ల రూపంలో పంచుకునే బండ్ల గణేష్ శనివారం ఉదయం ఓ ఆడియో ఫైల్ ను కూడా షేర్ చేశాడు. అందరికీ షాకిచ్చేలా ఉంది. చూస్తుంటే ఇంట్లో వాళ్లకు ఏదో అన్యాయం చేసిన ఫీలింగ్ బండ్ల గణేష్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పశ్చాత్తాపంతోనే ఆయన ఆడియోలో వాపోయినట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    శనివారం ఉదయం బండ్లగణేష్ షేర్ చేసిన ఒక ఆడియో ఫైల్ వైరల్ అయ్యింది. తల్లిదండ్రులను, భార్యా పిల్లలను మినహాయించి జీవితంలో ఎవరినీ నమ్మకూడదని బండ్ల అన్న మాటలు చూస్తుంటే ఎవరినో నమ్మి మోసపోయాడని.. ఇది ఖచ్చితంగా ఏదో తెరవెనుక వ్యవహారమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    జీవితంలో ఎవరినీ నమ్మొద్దని.. మనల్ని మనం నమ్ముకుందామని బండ్ల గణేష్ వాపోయారు. తల్లిదండ్రులు, భార్య పిల్లలను ప్రేమిద్దామని.. వాళ్లకు మంచి భవిష్యత్తును, అందమైన జీవితాన్ని అందిద్దామని బండ్ల గణేష్ తెలిపారు.కొన్నింటిపై ఇష్టాలు పెంచుకొని మన అనుకునే వాళ్లకి అన్యాయం చేయవద్దని బండ్ల గణేష్ తెలిపారు.

    ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘బండ్లన్న ఏమైంది? ఎక్కడ మోసపోయావ్? .. జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలిందా? అంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానించే బండ్ల గణేష్ ఆయన చేతిలో ఏమైనా మోసపోయాడా? పవన్ కల్యాణ్ సరిగా స్పందించలేదా? అందుకే ఇలాంటి ట్వీట్ పెట్టాడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. నమ్మి మోసపోయానంటే.. పవన్ గురించే అని కొందరు కామెంట్ చేస్తున్నారు. లేదా ఏదైనా వ్యక్తిగత జీవితంలో మోసమా? అన్నది తెలియాల్సి ఉంది. మరి దీనికి బండ్ల గణేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.