
Bhakti Tips: మహా శివుడికి బిల్వ పత్రమంటే మహా ఇష్టం. అందుకే భక్తులు వీటిని సమర్పించేందుకు ఉత్సాహం చూపుతారు. పరమ శివుడికి పవిత్రమైన బిల్వ పత్రాలను పెట్టి మొక్కితే మనం కోరుకున్న కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. దీంతోనే ఏక బిల్వం శివార్పణం అంటూ స్తుతిస్తారు. శివుడికి బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల మనకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. శివరాత్రి రోజు శివుడిని అందరు వేడుకుంటారు. తమ కష్టాలు తీర్చాలని కొలుస్తుంటారు. శివపార్వతుల కల్యాణం శివరాత్రి రోజే జరిగినట్లు చెబుతారు. అందుకే ఆ రోజు అందరు ఉపవాసం చేసి శంకరున్ని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తారు.
బిల్వం సమర్పణలో నియమాలేంటి?
బిల్వ పత్రాలు సమర్పించే సందర్భంలో కొన్ని నిబంధనలు పాటించాలి. ఎలా పడితే అలా బిల్వ పత్రాలు పెట్టడం శివుడికి ఇష్టం ఉండదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. బిల్వ పత్రాలు శివుడికి పెట్టే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. శివుడిని సంతోషపెట్టేందుకు మనం చేసే పూజల్లో బిల్వ పత్రాలు ముఖ్యమైనవి. బిల్వ పత్రాలు పెట్టకపోతే పూజ సమాప్తం కానట్లే. దీంతో వీటిని సమర్పించేందుకు కొన్ని రోజులు ప్రత్యేకంగా కేటాయించారు.
అవి ఏంటి?
శివలింగానికి 11 లేదా 21 బిల్వ పత్రాలు సమర్పించుకోవచ్చు. చతుర్తి, అష్టమి, నవమి, ప్రదోష వ్రతం, శివరాత్రి, అమావాస్య, సోమవారం రోజుల్లో బిల్వ పత్రాలు పెట్టడం మంచిది. దేవుడికి పెట్టే రోజు కంటే ఒక రోజు ముందే ఆకులను సేకరించుకోవడం ఉత్తమం. మనం రెగ్యులర్ గా పెడితే రెండు ఉండేలా చూసుకోవాలి. బిల్వ పత్రాలంటే శివుడికి మహా ప్రీతి. అందుకే అందరు వాటితోనే పూజలు చేస్తారు. పరమశివుడిని ప్రసన్నం చేసుకుంటారు. తమ కోరికలు నెరవేర్చాలని వేడుకుంటారు.

ఎలాంటి ఆకులు కావాలి
శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు ఎండిపోయినవి కాకూడదు. మరకలు ఉన్న వాటిని తీసుకోకూడదు. చిరిగిపోయినవి కూడా ఉంచకూడదు. శివలింగానికి పెట్టే ఆకులను శుభ్రంగా కడిగి మృదువుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పూజ సమయంలో బిల్వ పత్రాలు అందుబాటులో లేకపోతే అంతకు ముందు రోజు ఉన్న ఆకులను కూడా శుభ్రం చేసి వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా మూడు బిల్వ పత్రాలు మాత్రమే పెట్టాలి. లేదంటే శివుడి అనుగ్రహం మన మీద ఉండదు. మహాశివరాత్రి సందర్భంగా శివుడిని బిల్వ పత్రాలతో కొలిచి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.