
Ustaad Bhagat Singh: దేశస్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వాళ్లకు వెన్ను చూపని వీరుడు భగత్ సింగ్. నునూగు మీసాల వయసులోనే భారత్ మాతా కీ జై అని నినదించాడు. ఉరికొయ్యకు వేలాడదీస్తున్నా బ్రిటీష్ వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూసిన ధీశాలి. అటువంటి భగత్ సింగ్ పేరు ప్రస్తావనకు వస్తే దేశ యువత పులకరించిపోతుంది. అతడి వీరత్వాన్ని కథలు కథలుగా చెబుతుంది. ఇప్పుడు అతడి ధీరోధత్తాన్ని సినిమాగా తీసేందుకు హరీష్‌శంకర్ ఉవ్విళ్లూరుతున్నాడు. తెలుగునాట యూత్‌లో విపరతీమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే పేరు పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఫొటోను హరీష్‌శంకర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంలో కోట్లల్లో వ్యూస్ వెళ్తున్నాయి. ట్విట్టర్‌లో ఏకంగా ట్రెండింగ్‌గా మారింది.
ఇక హరీశ్ శంకర్ విడుదల చేసిన ఫొటోలో పోలీస్‌స్టేషన్ నేపథ్యం కన్పిస్తోంది. కుర్చీలో కూర్చున్న ఓ పోలీస్ ఓ వైపు రివాల్వర్, మరో వైపు టీ గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. చాలా మంది ఈ ఫోటలో ఉన్నది పవన్ కల్యాణ్ అనే అనుకుంటున్నారు. కానీ ఆ కుర్చీలో కూర్చున్నది తానే అని చెప్పేదాకా అతడు హరీష్ శంకర్ అని గుర్తు పట్టలేకపోయారు. అయితే పవన్ కల్యాణ్ మానియా ఆ స్థాయిలో ఉంది మరి. ఇక ఈ పోస్టర్‌లో ఓ వైపు భగత్ సింగ్ ఫొటో, మరో వైపు పోలీస్‌శాఖకు సంబంధించిన సూక్తులు కనిపిస్తున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి గత ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. కథ విషయంలో పలు మార్పులు జరిగాయి. అయితే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గబ్బర్‌సింగ్ పేరుతో సినిమా వచ్చింది. దబాంగ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దబాంగ్ సినిమాను మించి వసూళ్లు సాధించింది. పవన్ కల్యాణ్‌కు మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. ఇక కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సారి కేవలం వినోదం మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్నారు. చూడాలి మరి ఈసారి పవన్ కల్యాణ్‌ను హరీష్ శంకర్ ఎలా చూపిస్తాడో.. అల్ రెడీ విడుదలయిన ప్రచార పోస్టర్‌లో టీ గ్లాస్ పట్టుకున్న పవన్ కల్యాణ్ ఫొటో ప్యాన్స్‌కు పునకాలు తెప్పిస్తోంది. పోస్టరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో?!

అయితే నిజ జీవితంలో పవన్ కల్యాణ్ భగత్ సింగ్ లాంటి వాడని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. అన్యాయాన్ని సహించలేని తనం, అయిన వారి కోసం ఎందాకైనా వెళ్లేతత్వం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం చాలా మందికి నచ్చుతుంది. అందుకే అతడంటే అభిమానులు పిచ్చి పిచ్చిగా ప్రేమను కనబరుస్తారు. ఇక ఈ సినిమాలో భగత్ సింగ్ భావాలు.. పవన్ కల్యాణ్ లక్ష్యాల ఆధారంగా హరీష్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథలో మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. అభిమానులను అలరించే విషయాలకు పెద్దపీట వేస్తున్నట్టు వినికిడి. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది అని ఒక్క మాట మాట్లాడగానే థియేటర్లన్నీ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.