https://oktelugu.com/

Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? హమ్మయ్య ఈ ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం లభించింది..

సినిమాల నుంచి మొదలుపెడితే సీరియల్స్ వరకు.. కాల్పానిక సాహిత్యం నుంచి మొదలుపెడితే నవలల వరకు ఈ ప్రశ్న రాని సందర్భం అంటూ లేదు. కాకపోతే సమాధానం లేని అంటూ ఈ ప్రశ్న.. ఎన్నోసార్లు చర్చకు దారి తీసింది.. మరెన్నో సార్లు బుర్రను బద్దలు కొట్టుకునేలా చేసింది. అయితే ఇన్నాళ్లకు ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 10:19 AM IST

    Chicken Or Egg

    Follow us on

    Chicken Or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా.. ఈ ప్రశ్న నిత్య జీవితంలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. కొన్నిసార్లు గుడ్డు అని.. కొన్నిసార్లు కోడి అని.. సమాధానం చెప్పినా.. అది స్పష్టమైన సమాధానం కాదని అందరికీ తెలుసు. కోడి ముందు పుడితే.. అది పుట్టడానికి అవసరమైన గుడ్డు ఎక్కడ నుంచి వచ్చిందని.. గుడ్డు ముందని చెబితే.. ఆ గుడ్డు పెట్టే కోడి ఎలా వచ్చిందని.. ఇలా రకరకాల విశ్లేషణలు మన జీవితంలో సాగుతూనే ఉంటాయి. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అక్కడిదాకా ఎందుకు జీవపరిణామ క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి.. ఆవిష్కరించిన చార్లెస్ డార్విన్ కూడా కోడి ముందా.? గుడ్డు ముందా? అనే విషయాన్ని వెల్లడించలేకపోయాడు. ఆయన మాత్రమే కాదు జీవశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను కనుగొన్న శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానాన్ని చెప్పలేకపోయారు. అందువల్లే కోడి ముందా? గుడ్డు ముందా అనే ప్రశ్న భేతాళ ప్రశ్న గానే మిగిలిపోయింది.

    ఇన్నాళ్లకు సమాధానం లభించింది

    కోడి ముందా? గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం లభించింది. జెనీవా విశ్వవిద్యాలయంలోని జీవ రసాయన శాస్త్రవేత్త ఒలివెట్ట నేతృత్వంలో బృందం పరిశోధనలు చేపట్టింది. ఈ పరిశోధనలు చాలా సంవత్సరాల పాటు సాగుతున్నాయి. జీవుల ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న ప్రయోగాలలో పిండంపై అధ్యయనాలు చేశారు. అయితే ఈ భూమి మీద జంతువుల ఆవిర్భావానికి ముందే ఒక పిండం లాంటి నిర్మాణం ఏర్పడి ఉంటుందని.. అది అనేక రూపాంతరాలు చెంది జీవుల పుట్టుకకు కారణమై ఉంటుందని పేర్కొన్నారు. అంటే సూత్రీకరణ ప్రకారం కోడి అనేది ముందు కాదని.. గుడ్డు మాత్రమే ముందు ఏర్పడిందని.. అది అనేక రూపాంతరాలు చెంది కోడి ఏర్పడిందని శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ అధ్యయనానికి ఇంకా ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల నుంచి ఆమోదం రాలేదు. అయితే కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు మాత్రం గుడ్డే ముందు అనే సమాధానం ప్రస్తుతం లభిస్తోంది. అయితే ఇది అందరికీ ఆమోద యోగ్యం అవుతుందా? లేక మరోసారి భేతాళ ప్రశ్న గానే మిగులుతుందా అనేది తేలాల్సి ఉంది. “విశ్వం పుట్టుకకు సంబంధించి అనేక అధ్యయనాలు ఉన్నాయి. అయితే ఇందులో బిగ్ బ్యాంగ్ థియరీనే మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మేం ప్రతిపాదించే విధానం కూడా అదే. విశ్వం ఏర్పడిన అనంతరం జీవి పుట్టుకకు ముందు పిండం లాంటి పదార్థం ఏర్పడి ఉంటుంది. అది అనేక రూపాంతరాలు చెంది ఒక జీవి లాగా ఏర్పడి ఉంటుంది. ఆ జీవి మిగతా జీవుల ఏర్పాటుకు నాంది పలికి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ విషయంలో మేము ఒక స్పష్టతతో ఉన్నామని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు.