
Bedurulanka 2012 Teaser Review: ప్రపంచానికి దూరంగా నాగరికతకు నోచుకుండా గోదారి నది మధ్య ఉన్న పల్లె పేరే బెదురులంక. ఈ పల్లెకో పెద్ద సమస్య వచ్చింది. త్వరలో యుగాంతం అన్న వార్తలతో బెంబేలెత్తిపోతుంది. ప్రచారం నిజమే అని ఊరోళ్లు నమ్మేశారు. ఒకటి రెండు రోజుల్లో చచ్చిపోతాం అంటే జనాలు ఏం చేస్తారు? ఆ జనాల అమాయకత్వం క్యాష్ చేసుకోవడానికి తెలివిగల కన్నింగ్ గాళ్ళ ప్లాన్స్ ఏమిటీ? ఈ కథలో అసలు హీరో రోల్ ఏంటి? మొత్తంగా చెప్పాలంటే ఇదే బెదురులంక 2012 మూవీ స్టోరీ. అప్పట్లో 12-12-1012న యుగాంతం అంటూ ప్రచారం జరిగింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో భూమి అంతం అన్న ప్రచారం జరిగింది.
టీఆర్పీల కోసం ఇలాంటి పుకార్లను టీవీ ఛానల్స్ కూడా పనిగట్టుకుని ప్రచారం చేశారు. అవన్నీ నిజమే అని నమ్మి చేయకూడని పనులు చేసినవాళ్లు ఉన్నారు. తీరని కోరికలు తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే బెదురులంక మూవీ తెరకెక్కింది. ఒక చిన్న పల్లెలో మూఢనమ్మకాలు, మతాలు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని అమ్మాయకులతో ఎలా ఆడుకున్నారనే విలేజ్ డ్రామా.
కార్తికేయ హీరోగా నటించగా… డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను కామిక్ గా ప్రస్తావించినట్లు ఉన్నారు. దర్శకుడు అనుకున్న పాయింట్ కి రొమాన్స్, లవ్ ట్రాక్స్ జోడించారు. అలాగే యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మొత్తంగా బెదురులంక టీజర్ గజిబిజిగా సాగినా ఆకట్టుకుంది. సినిమాలో విషయం ఉందన్న భావన కలిగించింది.

బెదురులంక 2012 చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించారు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, సత్య, గెటప్ శ్రీను కీలక రోల్స్ చేశారు. ఇక హీరోగా కార్తికేయ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. గత ఏడాది అజిత్ సూపర్ హిట్ వలిమై మూవీలో విలన్ రోల్ చేశాడు. కనీసం బెదురులంక 2012 హిట్ ఇస్తుందేమో చూడాలి. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీతో కార్తికేయ బ్లాక్ బస్టర్ కొట్టాడు. మరలా ఆ రేంజ్ హిట్ ఆయనకు పడలేదు. దీంతో విలన్ గా కూడా ట్రై చేస్తున్నాడు.