Barrelakka Video Viral : తెలంగాణలో బర్రెలక్క (శిరీష) గురించి తెలియని వారుండరు. ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయ్యారు. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ వేయడం లేదని, దీంతో బర్రెలు కాస్తున్నానంటూ ఆమె చేసిన రీల్ వైరల్ కావడంతో ఆమెకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. దీంతో ఆమె పాపులర్ కావడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బరిలో నిలిచారు. ఈమెకు ఫారిన్ నుంచి కూడా కొందరు మద్దతు పలకడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు సైతం షాక్ కు గురయ్యారు. అయితే ఆమెకు డిపాజిట్ కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయయ్యాు. తనకు ఓట్లు రాకపోవడానికి కారణం ఓ యూట్యూబర్ అంటూ ఆయనపై ఫైర్ అయింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అసెంబ్లీ ఎన్నికల్లో శీరిష పోటీ చేయడంతో సంచలనంగా మారింది. నిరుద్యోగుల తరుపున తాను అసెంబ్లీలో పోరాడుతానంటూ ప్రచారం చేయడంతో యువతలో ఆశలు రేకెత్తాయి. దీంతో కొందరు నేరుగా ఆమెకు మద్దతుగా ప్రచారం చేయగా.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా సపోర్టుగా నిలిచారు. ఈమెకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీతో పాటు అమెరికా నుంచి కూడా కొందరు మద్దతు పలకడం విశేషంగా మారింది. ఒక దశలో శిరీష అసెంబ్లీలో అడుగుపెడుతానని అందరూ అనుకున్నారు.
అయితే 5 వేల ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు తక్కువ ఓట్లు రావడానికి తన గురించి తప్పుగా ప్రచారం చేయడమేని అసెంబ్లీ రిజల్ట్ సందర్భంగా శిరీష తెలిపింది. కొన్ని రోజుల కిందట తన గురించి ప్రచారం చేసిన ఓ యూట్యూబర్ పై ఆమె ఫైర్ అయింది. అంతేకాకుండా ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది. తన తండ్రికి డబ్బులిచ్చి తన గురించి తప్పుగా ప్రచారం చేశావని, తన పరువు తీశావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల సమయంలో తన తండ్రితో వీడియో తీయించి తన ఓట్లు తగ్గేలా చేసాడని ఒక యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోయిన బర్రెలక్క. pic.twitter.com/2FhTsWeauP
— Actual India (@ActualIndia) February 1, 2024