Bangaram Girl: ”బంగారం చాలా మంది అడుగుతున్నారు. నీ బంగారం ఎవరని? ఏం చెప్పను? నువ్వు దూరమైనావని చెప్పనా? లేక నా దగ్గరున్నావని చెప్పనా…” ఈ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యింది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఆమె తెలియని సోషల్ మీడియా జనాలు లేరు. ఒక్క వీడియోతో ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మాయి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలని అందరూ ఆశపడుతున్నారు. కాగా ఆమె గురించి ఓ యూట్యూబ్ ఛానల్ వాకబు చేయడంతో పాటు ఇంటర్వ్యూ తీసుకున్నారు. దానితో బంగారం యువతి కష్టాల జీవితం తెరపైకి వచ్చింది.
ఆ వీడియో చేసిన అమ్మాయి పేరు శాంతి. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయారు. కన్న తండ్రి కోసం కొన్నాళ్ళు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితో పాటు ఓ తమ్ముడు ఉన్నాడు. 10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైంది. కొందరు తన తల్లిని కొట్టారని చెబుతూ శాంతి ఆవేదన చెందారు.
సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నారు. ఓ రోజు బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు.. అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్, ఇన్నోసెన్స్ కలగలిపి ముచ్చటగొలిపేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఓవర్ నైట్ శాంతి ఫేమ్ తెచ్చుకున్నారు. ఆమె డైలాగ్ చెబుతూ వేలల్లో సోషల్ మీడియా వీడియోలు పుట్టుకొచ్చాయి. డీజే సాంగ్స్ చేశారు.
కాగా శాంతి జబర్దస్త్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి ఉన్నారు. దీంతో ఆమె త్వరలో జబర్దస్త్ వేదికపై కనిపిస్తారన్న క్లారిటీ వచ్చింది. శాంతి మంచి ఆర్టిస్ట్ గా ఎదిగి కుటుంబానికి ఆధారం కావాలని అందరూ కోరుకుంటున్నారు.అలాగే శాంతి అలాంటి అలరించే వీడియోలు మరిన్ని చేయాలని ఆశపడుతున్నారు. మరి శాంతి జీవితం ఇకపై ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.