Bandla Ganesh- Trivikram: బండ్ల గణేష్ తీరు ఎవరికీ అర్థం కాదు. మనసులో ఉన్నది ఏదైనా బయటకు కక్కేస్తారు. పవన్ కళ్యాణ్ తో స్నేహం విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ని ఆయన టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనను దూరం పెట్టడానికి కారణం త్రివిక్రమే అని బహుశా ఆయన భావిస్తున్నారనిపిస్తుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా బండ్ల గణేష్-త్రివిక్రమ్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు నన్ను రాకుండా చేస్తున్నాడని ఆరోపించారు. ఈ ఆడియో కాల్ బయటకు లీకైంది.

బండ్ల గణేష్ అది నా వాయిస్ కాదు ఎవరో అనుకరించారు. నా ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం అని వివరణ ఇచ్చారు. ఇటీవల ఆ ఆడియో ఫైల్ లో ఉంది నా వాయిస్సే. ఏదో కోపంలో ఒక మాట అన్నాను. తర్వాత కలిసి సారీ చెప్పాను. ఏదో చిన్న విషయానికి మా మధ్య దూరం పెరుగుతుందా అని ఫ్లేటు ఫిరాయించాడు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేశారు. పరోక్షంగా త్రివిక్రమ్ పై సెటైర్లు వేశాడు.
” రియల్ పవన్ కళ్యాణ్ ని బయటకు తీసింది నేనే. ఈయన మామూలు మనిషి కాదు. విపరీతమైన టాలెంట్ ఉంది. ఏదో అతీతమైన శక్తి ఉంది. ఈయన ఎక్కడో ఉండాల్సిన వాడని గుర్తించింది నేను. ఇప్పుడు గురూజీలు బరూజీలు వచ్చారు కానీ… ఆయనలోని గొప్ప తనాన్ని గుర్తించింది నేను” అని బండ్ల గణేష్ కామెంట్ చేశారు. పరిశ్రమలో త్రివిక్రమ్ కి మరో పేరు గురూజీ. ఆయన పవన్ కి అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. కాబట్టి బండ్ల గణేష్ గురూజీ అంటూ విమర్శించింది త్రివిక్రమ్ నే అని స్పష్టం అవుతుంది.

బండ్ల గణేష్ ఎన్ని అన్నా… త్రివిక్రమ్ అసలు స్పందించరు. ఆయన పని ఆయన చేసుకుంటారు. ఇంతకంటే దారుణమైన ఆరోపణలు ఎదురైనప్పుడు కూడా త్రివిక్రమ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. తన మీద వచ్చిన ఆరోపణలు ఖండించింది లేదు. పవన్ కళ్యాణ్ తో పవన్ కి చాలా కాలం నుండి పరిచయం ఉంది. ఆయన దర్శకత్వంలో పవన్ జల్సా చిత్రం చేశారు. అప్పటి నుండి వీరి స్నేహం మరింత బలపడింది. జల్సా సూపర్ హిట్ కొట్టింది. వీరి కాంబో వచ్చిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది.