https://oktelugu.com/

Bandla Ganesh Audio Leak: ‘భీమ్లా నాయక్’ ఫంక్షన్ కు పిలవలేదని త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు

Bandla Ganesh Audio Leak: టాలీవుడ్ అంటే ఇగోలు, హర్టింగులు, ఆధిపత్యపు పోరులు.. ఇప్పటికే సినిమా టికెట్ల వివాదం, మా ఎన్నికల్లో సినీ ప్రముఖుల వేశాలన్నింటిని జనాలు చూసేశారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే బండ్ల గణేష్ ను తాజాగా ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ వేడుకకు పిలవలేదని.. త్రివిక్రమ్ ను నానా బూతులు బండ్ల గణేష్ తిట్టాడని ఒక ఆడియో వైరల్ అవుతోంది. అది నిజమైనదా? లేక ఫేక్ దా తెలియదు కానీ అది మాత్రం ఇప్పుడు […]

Written By: , Updated On : February 22, 2022 / 04:28 PM IST
Follow us on

Bandla Ganesh Audio Leak: టాలీవుడ్ అంటే ఇగోలు, హర్టింగులు, ఆధిపత్యపు పోరులు.. ఇప్పటికే సినిమా టికెట్ల వివాదం, మా ఎన్నికల్లో సినీ ప్రముఖుల వేశాలన్నింటిని జనాలు చూసేశారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే బండ్ల గణేష్ ను తాజాగా ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ వేడుకకు పిలవలేదని.. త్రివిక్రమ్ ను నానా బూతులు బండ్ల గణేష్ తిట్టాడని ఒక ఆడియో వైరల్ అవుతోంది. అది నిజమైనదా? లేక ఫేక్ దా తెలియదు కానీ అది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bandla Ganesh Audio Leak

Bandla Ganesh comments on trivikram

పవన్ కు భక్తుడిగా బండ్ల గణేష్ ఉంటాడు. దేవుడిలా కొలుస్తాడు. గత ‘వకీల్ సాబ్’ఆడియో ఫంక్షన్ లో పవన్ గురించి ‘దేవర’ అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఆ సినిమా ప్రమోషన్ కు బాగా హెల్ప్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’కు కూడా బండ్ల గణేష్ వస్తే దానికి కొత్త ఊపు వస్తుందని అభిమానులు భావించారు.

ఈ క్రమంలోనే కొందరు పవన్ ఫ్యాన్స్ తాజాగా బండ్ల గణేష్ కు ఫోన్ చేసి ఫంక్షన్ కు వస్తున్నావని.. అడిగారని.. దానికి బండ్ల.. ‘తనను ఫంక్షన్ కు త్రివిక్రమ్ పిలువలేదంటూ బండ బూతులు తిట్టినట్టుగా’ ఒక ఆడియో వైరల్ అవుతోంది.

Also Read: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?

గుర్తు తెలియని పవన్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఈ ఆడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వాయిస్ చూస్తే బండ్ల గణేష్ మాట్లాడినట్టే ఉంది. మరి అది నిజమైందా? కట్ చేసి యాడ్ చేశారా? ఫేక్ దా అన్నది తేలాల్సి ఉంది.

ఈ ఆడియో ఏం ఉందంటే.. ‘భీమ్లా నాయక్’ ఫంక్షన్ కు బండ్లను త్రివిక్రమ్ పిలవలేదని.. బండ్లకు తెలిసి అభిమానులతో ఆయనను బండ బూతులు తిట్టాడు.. వైసీపీతో కుమ్మక్కై త్రివిక్రమ్ ఇలా చేస్తున్నాడని.. తనను దూరం పెట్టాడని ఆ ఆడియోలో హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇది నిజమైనదా? ఫేక్ దా? అన్నది తేలాల్సి ఉంది.

Also Read: చరణ్ సినిమాలో సీఎంగా ‘సూర్య’

Audio Leak: ఆ త్రివిక్రమ్ ని ఇంటికెళ్లి కొడతా | Bandla Ganesh Viral Phone Call Leak | Bheemla Nayak