https://oktelugu.com/

Pawan Kalyan – Bandla Ganesh : పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై బండ్ల గణేష్ ఫైర్.. నా విశ్వరూపం చూపిస్తా అంటూ సవాల్

Bandla Ganesh on fire over Pawan Kalyan’s comments : పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ చెప్పుకొని తిరిగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమానులపై యుద్ధం ప్రకటించబోతున్నాడా..?, కళ్యాణ్ పేరు చెప్తే పూనకం తో ఊగిపోయ్యే బండ్ల గణేష్ లాంటి వ్యక్తి అలా చెయ్యడం ఏంటి?,మనం ఏమైనా భ్రమపడుతున్నామా అని అనుకోవచ్చు, కానీ రీసెంట్ గా అతని ప్రవర్తన మొత్తం తేడాగానే ఉంటుంది.సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే బండ్ల గణేష్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2023 / 07:57 PM IST
    Follow us on

    Bandla Ganesh on fire over Pawan Kalyan’s comments : పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ చెప్పుకొని తిరిగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమానులపై యుద్ధం ప్రకటించబోతున్నాడా..?, కళ్యాణ్ పేరు చెప్తే పూనకం తో ఊగిపోయ్యే బండ్ల గణేష్ లాంటి వ్యక్తి అలా చెయ్యడం ఏంటి?,మనం ఏమైనా భ్రమపడుతున్నామా అని అనుకోవచ్చు, కానీ రీసెంట్ గా అతని ప్రవర్తన మొత్తం తేడాగానే ఉంటుంది.సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే బండ్ల గణేష్ ఈమధ్య పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా చాలా విమర్శలు సెటైర్లు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈరోజు అయితే ఆయన హద్దులు దాటి ప్రవర్తించాడనే చెప్పాలి.

    అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆహా మీడియాలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథి గా విచ్చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 27 వ తారీఖున షూటింగ్ ని జరుపుకున్న ఈ ఎపిసోడ్ మొన్ననే ఆహా లో అప్లోడ్ చేసారు.

    ఈ ఎపిసోడ్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఆహా మీడియా లోనే సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పి ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది..ఈ ఎపిసోడ్ రెండవ భాగం ఫిబ్రవరి 10 వ తారీఖున మన ముందుకు రాబోతుంది.అయితే మొన్న అప్లోడ్ చేసిన ఎపిసోడ్ లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘గబ్బర్ సింగ్ కి రెమ్యూనరేషన్ ఇచ్చారా’ అని అడుగుతాడు, అప్పుడు పవన్ కళ్యాణ్ నవ్వుతూ ‘ఇచ్చాడు కానీ..తను అనుకునంతే ఇచ్చాడు, నేను అనుకున్నంత ఇవ్వలేదు’ అని సమాధానం ఇస్తాడు.. దీనికి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.పవన్ ఫ్యాన్స్ మా హీరోకి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వమని బండ్ల గణేష్ ని ట్యాగ్ చేసి అడుగుతారు.

    https://twitter.com/ganeshbandla/status/1622105313070694400?s=20&t=bT3InOMIRt-EX7j-VHkEng

    అప్పుడు సహనం కోల్పోయిన బండ్ల గణేష్ ‘నేను నోరు విప్పితే గుండె ఆగి చస్తారు’ అని సమాధానం ఇచ్చాడు,ఆ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ దురాభిమాని బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తూ ‘చూసావా అన్నయ్యా..నువ్వు పవన్ కళ్యాణ్ ని అంతలా అభిమానిస్తావు,కానీ మీ బాస్ ఒక పాపులర్ రియాలిటీ షో లో నీ గురించి ఏమి చెప్పాడో చూడు’ అంటాడు, అప్పుడు బండ్ల ఆ ట్వీట్ కి సమాధానం ఇస్తూ ‘ఇక నుండి నేను కూడా నా విశ్వరూపం చూపిస్తా’ అని అంటాడు. కలలో కూడా ఊహించని ఈ పరిణామం చోటు చేసుకోవడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.