https://oktelugu.com/

Siddharth – Kiara Advani : సిద్దార్థ్ – కియారా అద్వానీ పెళ్లి కోసం చేస్తున్న ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు

Siddharth – Kiara Advani : పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ అతి త్వరలోనే బాలీవుడ్ క్రేజీ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్లాడబోతుంది..చాలాకాలం నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.కానీ కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమించుకుంటున్నట్టు కాదు , మంచి స్నేహితులు కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చాలామంది అనుకున్నారు. కానీ వచ్చిన న్యూస్ ప్రకారమే వీళ్లిద్దరు వివాహ బంధం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2023 8:01 pm
    Follow us on

    Siddharth – Kiara Advani : పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ అతి త్వరలోనే బాలీవుడ్ క్రేజీ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్లాడబోతుంది..చాలాకాలం నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.కానీ కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమించుకుంటున్నట్టు కాదు , మంచి స్నేహితులు కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చాలామంది అనుకున్నారు.

    కానీ వచ్చిన న్యూస్ ప్రకారమే వీళ్లిద్దరు వివాహ బంధం ద్వారా ఒకటవ్వడానికి సిద్ధం అయిపోయారు..వీళ్లిద్దరి వివాహం రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో జరగబోతుంది.ఇప్పటికే ఈ జంట రెండు కుటుంబాలు అక్కడకి చేరుకున్నాయి.వీళ్లిద్దరి వివాహం బాలీవుడ్ హిస్టరీ లోనే చిరస్థాయిగా నిలిచిపొయ్యే విధంగా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు..అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.

    ఇక వీళ్లిద్దరి వెడ్డింగ్ ప్లాన్ మొత్తం ముంబై కి చెందిన ఒక ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ డిజైన్ చేస్తున్నాడు..ఇది వరకు ఎంతో మంది అగ్ర తారలకు వీళ్ళు పెళ్లిళ్లు చేసి ఉన్నారు.ఎన్ని ఏళ్ళు గడిచినా ప్రతీ ఒక్కరు జీవితాంతం గుర్తుండిపోయ్యే రేంజ్ లో వివాహాలు చెయ్యడం వీళ్ళ స్పెషాలిటీ.ఈ పెళ్ళికి టాలీవుడ్ , బాలీవుడ్ నుండి ప్రముఖ స్టార్ సెలెబ్రిటీలతో పాటుగా రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రాబోతుండడం తో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రానివ్వకుండా చూసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారట.

    ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి వీళ్లిద్దరి వివాహం అత్యంత ఖరీదైన వివాహం గా బాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటుంది.కేవలం ఒక్క రోజు ఇక్కడ పెళ్లి జరుపుకోవాలంటే రెండు కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందట.అంటే మూడు రోజుల పాటు జరగబోతున్న ఈ వివాహ వేడుకకి సుమారు గా 6 కోట్ల రూపాయిలు ఖర్చు అవ్వబోతున్నట్టు సమాచారం.