Bandla Ganesh- Vijay Devarakonda: యాక్టర్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఖాళీగా ఉండరు. ట్విట్టర్లో ప్రతిరోజూ పోస్ట్స్ పెడుతూ ఉంటాడు. అవి వివాదాలకు కారణం అవుతాయి. తాజాగా బండ్ల గణేష్ హీరో విజయ్ దేవరకొండపై పరోక్షంగా సెటైర్స్ వేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. బండ్ల గణేష్ ట్వీట్ ఈ అనుమానాలకు దారితీసింది. బండ్ల గణేష్ తల్లిదండ్రుల ఉన్నతి, వాళ్ళను మనం ఎంత గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలో వివరిస్తూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. వాటిలో ఒకటి బండ్ల గణేష్ తన తండ్రికి హెయిర్ కట్ చేస్తున్నాడు. మరొక ఫోటోలో విజయ్ దేవరకొండ తండ్రికి ఎదురుగా సోపాలో కూర్చొని… టీపాయ్ పై కాలు పెట్టాడు.

ఈ రెండు ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్… ‘ ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టం మనకు ఇచ్చిన తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించడం, ప్రేమించడం మన ధర్మం’ అని కామెంట్ పెట్టాడు. బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ వారి తండ్రులతో ఉన్న ఫోటోలు చూస్తే విజయ్ దేవరకొండ తండ్రి పట్ల గౌరవం లేకుండా కూర్చున్నట్లుగా ఉంది. బండ్ల గణేష్ ఏమో.. తండ్రికి స్వయంగా క్రాప్ చేస్తూ ప్రేమను చాటుకున్నటున్నట్లు ఉంది. విజయ్ దేవరకొండకు వాళ్ళ నాన్న అంటే కనీస గౌరవం లేదు. తండ్రి ముఖాన కాళ్ళు పెట్టి కూర్చోవడం ఏమిటీ? అన్నట్లు ఉంది.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండపై బండ్ల గణేష్ సెటైర్ అంటూ కథనాలు వెలువడ్డాయి. సదరు మీడియా వార్తలకు బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. నేను ఎవరినీ గెలకలేదు. విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరి సప్పోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన వాళ్లకు మరింత గౌరవం ఇస్తాను… అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో కూడా విజయ్ దేవరకొండను బండ్ల గణేష్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు. లైగర్ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ… నా తాత ఎవడో తెలియదు, నాన్న ఎవడో తెలియదు, నేను ఎవడో తెలియదు, అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు, అంటూ వేదికపై చెప్పాడు. ఇది నెపో కిడ్స్ ని టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఈ మాటలకు కౌంటర్ గా బండ్ల గణేష్… బాబు తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ ఉంటేనే స్టార్ అవుతారని, విజయ్ దేవరకొండకు చురకలు వేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా ట్వీట్లో కూడా విజయ్ దేవరకొండను విమర్శించాడని నెటిజెన్స్ బావిస్తున్నారు.
https://twitter.com/ganeshbandla/status/1601978775939428352
దయచేసి టైంపాస్ చేయకండి నేనెవర్ని కేలకలెదు, నాకు విజయ్ అంటే ఇష్టం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అంటే ప్రాణం @TheDeverakonda https://t.co/zn4wVj6yjF
— BANDLA GANESH. (@ganeshbandla) December 12, 2022