Pawan Kalyan- Ram Charan: సుమారు పదేళ్ల నుండి మెగా అభిమానులు ఒక శుభవార్త వినడం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు.. మొత్తానికి ఆ శుభవార్తని నేడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నాడు..రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానానికి జన్మనివ్వబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపాడు.. ఎప్పుడైతే ఈ వార్త బయటకి వచ్చిందో అప్పటి నుండి సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తుంది.

ఈ ఏడాది #RRR వంటి సంచలన విజయంతో పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ కి, ఇదే ఏడాది లో మరో శుభం జరగడం ఆయన అభిమానులకు ఎంత సంతోషాన్ని కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు.. నేటి నుండి సరిగ్గా 9 నెలలు అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది..ఆగస్టు 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..అలాగే సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.
ఈ రెండు తేదీలలో ఏదో ఒక తేదీన డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.. అదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పొచ్చు..ఎందుకంటే చిరంజీవిని మరియు పవన్ కళ్యాణ్ ని ఆయన ఆరాధ్య దైవాలుగా కొలుస్తాడు.. ఇద్దరిలో ఎవరిని ఆయన ఎప్పుడూ కూడా తక్కువ చేసింది లేదు.. ఇంకా చెప్పాలంటే తన తండ్రి కంటే ఎక్కువగా తన బాబాయిని అభిమానిస్తూ ఉంటాడు రామ్ చరణ్.

చిన్నప్పటి నుండి ఆయనతో తనకి ఉన్న అనుబంధం అలాంటిది..చిరంజీవి షూటింగ్స్ లో బిజీ గా ఉంటున్న సమయం లో రామ్ చరణ్ ఆలనా పాలన చూసుకునే వాడు పవన్ కళ్యాణ్.. ఏ రోజు కూడా ఆయన బాబాయి లాగా వ్యవహరించలేదు.. రామ్ చరణ్ కి అన్నయ్య లాగానే ఉంటూ వచ్చాడు.. అలాంటిది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఉపాసన బిడ్డకి జన్మనిస్తే అంతకంటే సంతోషం ఏమి ఉంటుందని ఫ్యామిలీ సంతోషపడుతోంది. అభిమానులు ఇదే విషయాన్ని చాటుకుంటూ కామెంట్ చేస్తున్నారు.